Political News

ఏపీలో ముఠాల పాల‌న‌: జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌జా పాల‌న స్థానంలో ముఠాల పాల‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం రాజ‌కీయ హింస‌కు కేంద్రంగా మారిపోయింద‌ని విమ‌ర్శించారు. గ‌త రెండు నెల‌ల కాలంలో రాష్ట్రంలో హింసాయుత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. రాజ‌కీయ ప్రేరేపిత దుర్మార్గాలు కొన‌సాగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రోజూ ఏదో ఒక చోట హింస జ‌రుగుతూనే ఉంద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. రాష్ట్రం ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారిపై దాడులు చేస్తున్నార‌ని.. ఇప్పుడు త‌న‌ను ప్ర‌శ్నించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో చంద్ర‌బాబు స‌ర్కారు ఈ రాజ‌కీయ దాడులు చేయిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

వైసీపీ నాయ‌కుల‌పై జ‌రుగుతున్న హ‌త్యా రాజ‌కీయాల వెనుక ప్ర‌భుత్వ పాల‌కుల హ‌స్తం ఉంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దారుణాల‌కు బ‌లైన పోయిన వారి కుటుంబాల‌కు, బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఉన్న జ‌గ‌న్ ఇంత తీవ్రంగా స్పందించ‌డానికి కార‌ణం.. తాజాగా నంద్యాల‌లో జ‌రిగిన హ‌త్యే. నంద్యాల జిల్లాలో శ‌నివారం అర్థ‌ రాత్రి వైసీపీ నాయ‌కుడిని దారుణంగా హ‌త్య చేశారు. అదేరోజు.. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఓ నాయ‌కుడిపై దాడి చేశారు. ఆయా ఘ‌ట‌న‌ల‌ను కోట్ చేసిన జ‌గ‌న్‌.. వీటి వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని ఆరోపిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు.

This post was last modified on August 5, 2024 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సలార్’లో మిస్సయి.. ‘రాజాసాబ్’లో ఫిక్సయింది

మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో…

32 minutes ago

తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి సంబంధించి స‌రికొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. దీనికి 'తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి' అనే పేరును…

1 hour ago

రేవంత్ రెడ్డిని గుర్తుపట్టని మన్మోహన్ కుమార్తె

పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

2 hours ago

యానిమల్ పోలిక వద్దు బాసూ…

కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్…

3 hours ago

అభిమానంతో కేకలు వేస్తూ నన్ను బెదిరించేస్తున్నారు : పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం…

3 hours ago

వార్ 2 : తారక్ డ్యూయల్ షేడ్స్?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్…

5 hours ago