టిడిపిలో నామినేటెడ్ పదవుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులు టికెట్లను త్యాగం చేశారు. చంద్రబాబు చెప్పారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా వంటి వారు పోటీకి దూరంగా ఉన్నారు. ఇలా అనేక జిల్లాల్లో నాయకులు పోటీకి సిద్ధమైన తర్వాత చంద్రబాబు నుంచి పిలుపు రావడం పోటీ నుంచి విరమించుకోవాలని ఆయన చెప్పడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయితే వీరందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అయితే వచ్చింది. కానీ, రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు వారిని పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం వంటి కీలక స్థానాన్ని వదులుకున్న వర్మ తనను పట్టించుకోవడంలేదని క్షేత్రస్థాయిలో తన అనుచర వర్గానికి చెబుతున్నారు. “నాకే దిక్కులేదు మీకేం చేస్తాను” అంటూ తాజాగా ఆయన తన అనుచరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.
ఇక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బహిరంగంగానే తన ఆవేదనను ఆక్రోసాన్ని వెళ్ళగక్కారు. తనకు ఎలాంటి పదవులు లేవని తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. ఇలాంటివారు రాష్ట్రం వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నారు. అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా వేచి చూసే దారుణంలోనే కొనసాగుతున్నారు.
దీంతో టీడీపీలో అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయని చెప్పాలి. మరో రెండు మూడు నెలల్లో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ్ముళ్ల అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కనక వీరందరినీ పక్కన పెడితే వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ పుంజుకోవటం కొంత కష్టంగానే ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఉన్న పదవుల్లో టిడిపికి దక్కే వాటిని సత్వరమే ఇవ్వాలని, తద్వారా తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తి తొలగించాలని పార్టీ పుంజుకునేలా ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు.
This post was last modified on August 5, 2024 6:51 am
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…