ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ సమంజసమని, అలా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆ చరిత్రాత్మక తీర్పుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో స్పందించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో చెప్పారు. ఈ ఉప వర్గీకరణ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోందని, అలుపెరగని పోరాటం చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. 2004 లోనే ధర్మం ఏనాటికైనా గెలుస్తుందని తాను చెప్పానని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని మందకృష్ణ చెప్పారు.
తమ జాతికి న్యాయం జరగడం కోసం దశాబ్దాల తరబడి ఎమ్మార్పీఎస్ పోరాటం చేసి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ విజయం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల చొరవ, మద్దతు, కృషి ఉన్నాయని మందకృష్ణ మాదిగ కొనియాడారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు శ్రీకారం చుట్టారని, కాకతాళీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీల వర్గీకరణకు చంద్రబాబు తమకు ఎల్లప్పుడూ మద్దతుగానే ఉన్నారని మందకృష్ణ మాదిగ గుర్తు చేసుకున్నారు.
మొదట వర్గీకరణ చేసిన సమయంలో చంద్రబాబు సీఎం అని..ఆయన స్థానంలో వేరొకరుంటే వర్గీకరణ జరిగేది కాదని గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు చంద్రబాబు వర్గీకరణ చేయకుంటే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు తమకు వచ్చేవి కావని గుర్తు చేసుకున్నారు. న్యాయం బతికింది అంటే ఆయన తెచ్చిన చట్టం వల్లే అని అన్నారు.
This post was last modified on August 1, 2024 3:38 pm
టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శనపై అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బౌలింగ్ విభాగం మంచి ప్రదర్శన చూపించినప్పటికీ,…
సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. 'ఏ'తో దాన్ని ముప్పై…
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…