దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్!! అంటూ వైసీపీ మాజీ నేత, ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ రువ్వారు. “శ్వేతపత్రాల పై ఏమైనా చెప్పాలని అనుకుంటే.. సభకు వచ్చి చెప్పాలి. మీడియా ముందు.. సొంత చానెళ్లలోనూ తప్పుడు ప్రచారం చేయడం ఎందుకు? అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొలుసు.. జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్‌కు ఒక విజన్ అంటూ లేదని.. అందువల్లే రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయిపోయిందని చెప్పారు. కనీసం ఆసుపత్రుల్లో రోగులకు అందించే భోజనాల బిల్లులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని దుయ్యబట్టారు.
ఆరోగ్య శ్రీ బిల్లులు ఇవ్వకుండా ఆసుపత్రులను ముప్పుతిప్పలు పెట్టారని చెప్పారు. విజన్ లేని నాయకుడి కారణంగానే రాష్ట్రం అథోగతికి చేరుకుందన్నారు. ఇప్పుడు చంద్రబాబు దీనిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారని చెప్పారు.
తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి జగన్ చేసింది ఏమీలేదన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులు తప్ప.. రాష్ట్రానికి రూపాయి కూడా పెట్టుబడులు తీసుకురాలేదని తెలిపారు. దీనికి తోడు దోపిడీలు.. అక్రమాల కుప్పలు ఇప్పుడు బయట పడుతున్నాయని చెప్పారు.
వీటిని అసెంబ్లీ వేదికగా తాము ప్రస్తావిస్తే.. తాను మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మీడియా ముందు కూర్చుని కబుర్లు చెబుతున్నాడని అన్నారు. ఢిల్లీ వెళ్లింది ఎందుకు? అని కొలుసు ప్రశ్నించారు.
గంజాయి బ్యాచ్‌లో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసిందని కొలుసు చెప్పారు. దీనిని కూడా ఢిల్లీ వరకు తీసుకు వెళ్లి ధర్నా చేయడానికి సిగ్గుండాలన్నారు. ఏం జరిగినా.. ప్రభుత్వానికి ఆపాదించడం దారుణమని వ్యాఖ్యానించారు.
ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి జగన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తోందని.. వీటిని తాము సమర్థంగా ఎదుర్కొంటామని కొలుసు చెప్పారు. ఏదేమైనా సభకు వచ్చి తాము సచ్ఛీలురమని నిరూపించుకోవాలని సూచించారు.
This post was last modified on July 31, 2024 6:45 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…