కారణం ఏమైనా కానీ ఇజ్రాయెల్ మీద దాడికి దిగి.. వారికి షాకిచ్చిన హమస్ అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియెను చంపేసినట్టు ఇజ్రాయల్ పేర్కొంది.
ఇరాన్ లో జరిగిన దాడిలో తమ అగ్రనేత చనిపోయినట్లుగా హమాస్ గ్రూప్ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని హనియె నివాసం మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. హమస్ అగ్రనేతతో పాటు అతడి బాడీ గార్డు కూడా మరణించాడు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హనియె మీద దాడి జరిగిందని.. అందులో ఆయన చనిపోయినట్లుగా హమస్ వెల్లడించింది. అయితే.. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ బహిరంగ ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే.. పాత శత్రుత్వంతో చూసినప్పుడు ఈ హత్యకు ఇజ్రాయెల్ కారణమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తాజా పరిణామం అంతర్జాతీయంగా కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. తమ దేశంలో అతిధిగా ఉన్న అగ్రనేతను చంపేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించే వీలుంది.
అదే జరిగితే.. కొత్త ఉద్రిక్తతలకు తెర తీసినట్లే. ఇదిలా ఉంటే.. ఈ దాడికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేవని.. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
హనియా విషయానికి వస్తే 1962లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంంలో పుట్టాడు. 1980చివర్లో హమాస్ లో చేరాడు. 1990లో అతని పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు ఇతను అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలు ఇస్తూ ఆయనకు కుడి భుజంగా మారాడు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సంస్థలో అనేక స్థానాల్లో పని చేశాడు.
2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హత్యకు గురైన తర్వాత అతను కీలకంగా మారారు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా పట్టీని పాలించాడు. 2007లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో ఫతా – హమాస్ యుద్ధం జరుగుతోంది. అబ్బాస్ ఆదేశాల్ని పక్కన పెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్ని కొనసాగిస్తున్నాడు. 2017లో హమాస్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. అతడ్ని అమెరికాలో ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు.
2019లో గాజా పట్టీని వదిలిపెట్టేసి ఖతార్ లో ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు.. నలుగురు మనమరాళ్లు.. మనమళ్లను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారు. తాజాగా ఆయన్ను హతమయ్యారు.
This post was last modified on July 31, 2024 1:58 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…