Political News

ప్రతిపక్ష హోదా లేదని ఆయన రారు.. ఉన్నా ఈయన రారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో అంశం అందరిని ఆకర్షించటమే కాదు.. మాట్లాడుకునేలా చేస్తోంది. వరుసగా జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికారపక్షాలు ఓటమిపాలు కావటం.. విపక్షాలు విజంయ సాధించి అధికారపక్షంగా అవతరించటం తెలిసిందే. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష అధినేతలు ఇద్దరు అసెంబ్లీకి రాని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గత ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం.. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలవటం తెలిసిందే. ప్రతిపక్ష నేత హోదాను సొంతం చేసుకున్నారు కేసీఆర్. అయినప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటం తెలిసిందే. తన ప్రతి ప్రసంగంలోనూ ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే ప్రస్తావించటం కనిపిస్తుంది.

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భం తర్వాత.. మొన్న బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో మాత్రమే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్.బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం బయటకువచ్చి నేరుగా మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ ఉత్త గ్యాస్ గా అభివర్ణించటం తెలిసిందే. అధికారపక్షాన్నిచీల్చి చెండాడుతామని చెప్పిన ఆయన.. ఆ తర్వాత నుంచి సభకు వచ్చింది లేదు.

ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి వచ్చి.. అధికారపక్షం చేసే తప్పుల్ని ఎత్తి చూపటం.. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటి పని చేయని కేసీఆర్.. విమర్శలకు గురవుతున్నారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తోంది. ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాల్ని సొంతం చేసుకుంటే.. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి.

నిబంధనల ప్రకారం చూసినప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అదే సమయంలో సభలోని మొత్తం సీట్లలో పదో వంతు కూడా రాని నేపథ్యంలో వైసీపీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే.. ఈ అంశంపై న్యాయపోరాటానికి దిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుట్రపూరితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాఉంటే.. అసెంబ్లీలో మాట్లాడే వీలు ఉంటుందని.. అందుకే హోదా ఇవ్వాలని కోరినట్లుగా చెప్పుకున్నారు. దీనిపై ఏపీ అధికారపక్షం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది.

సంప్రదాయాల్ని పాటిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. కోర్టును ఆశ్రయించారు. మొత్తంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష అధినేతల తీరు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉండి కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావట్లేదు. అదే సమయంలో తనకు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వని కారణంగా వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు. మొత్తంగా హోదా ఉన్నా.. లేకున్నా.. సభకు మాత్రం రాని గత పాలకుల తీరు హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on July 31, 2024 11:45 am

Share
Show comments
Published by
Satya
Tags: JaganKCR

Recent Posts

పాత వాహనాలపై కొత్త నిబంధనలు.. లేదంటే కేసే!

మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…

7 minutes ago

పెద్ది అసలు కథ వేరే ఉంది

ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…

21 minutes ago

పవన్ నిబద్ధతకు అద్దం పట్టిన ‘బాట’ వీడియో

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…

1 hour ago

బాషా ఫ్లాష్ బ్యాక్ : ముఖ్యమంత్రితో వివాదం

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…

1 hour ago

భారత్‌కు 26/11 కీలక నిందితుడు.. పాకిస్తాన్ పాత్ర బయటపడుతుందా?

2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…

2 hours ago

జగన్ కు అన్ని దారులూ మూసేస్తున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…

2 hours ago