తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. విద్యుత్ కమిషన్ అంశంపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించిన వైనం చర్చనీయాంశమైంది. 24 గంటల విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం చంద్రబాబు హయాంలోనే జరిగిందని చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు ప్రస్తావించారు.
20 ఏళ్లు కలిసి పనిచేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. గ్లాస్ మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి అని, కానీ, అన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన వారిని గౌరవించకపోవడం సరికాదని హితవు పలికారు. తనకు అటువంటి గుణం లేదని, మిత్రులను సహచరులను బాగా చూసుకుంటానని, పెద్దవారిని గౌరవిస్తానని రేవంత్ అన్నారు . తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని రేవంత్ ఘాటుగా విమర్శించారు.
కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడి ప్రతిరూపం అన్న రీతిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ విద్యుత్ కమిషన్ ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తేనే ఆ నిజాయితీ ఏంటో తేటతెల్లమవుతుందని చెప్పారు. చర్లపల్లి జైల్లో ఉన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని, కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తామని రేవంత్ ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్లే హైదరాబాద్ కి ఆదాయం పెరిగిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
This post was last modified on July 29, 2024 2:23 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…