తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి కాంగ్రెస్ నేతలది కాదంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
అటువంటప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని, వేరే వారు తీసుకోవచ్చు కదా అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులలోకి నెట్టేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందని అన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్ ను యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని, జనాభా ప్రాతిపదికన కాదని గుర్తు చేశారు.
పదేళ్లపాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్…ఈ రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ఆయన మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. తమపైన నిందలు వేయడం ఏంటని రాజగోపాల్ అసహనం వ్యక్తం చేశారు అన్ని సవ్యంగా ఉంటే విద్యుత్ సంస్థలు నష్టాలలోకి ఎందుకు వెళ్తాయని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నాడూ నేడూ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 29, 2024 2:19 pm
'కుమారి 21 ఎఫ్'మూవీ తో ఫుల్ ఫేమస్ అయిన నటి హెబ్బా పటేల్. ఈ మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో…
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…