ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన జన్ సురాజ్ అనే సంస్థను ప్రారంభించాడు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబరు 2 న పార్టీని ప్రారంభిస్తున్నానని, పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తానని పీకే స్పష్టం చేశాడు.
బీహార్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం జన్ సురాజ్ లక్ష్యమని, బీహార్ భవిష్యత్తు కోసం శ్రమిస్తామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కోటి మంది తన పార్టీలో చేరుతారని భావిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలలో కూడా కోటి మంది కార్యకర్తలు లేరు. మరి కోటి మంది చేరతారన్న పీకే వ్యాఖ్యలు ఆసక్తికరమే.
2012లో మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకె 2014లో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. అంతకుముందు ఐక్యరాజ్యసమితిలో ఐదేళ్లపాటు పనిచేశాడు. 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టం నితీష్ కుమార్ అవలంబించిన వైఖరిని తప్పుపట్టాడు. దీంతో 2020 జనవరిలో పీకేను జేడీయూ నుండి బహిష్కరించారు. మరి బీహార్ లో రాజకీయ అరంగేట్రం చేయనున్న పీకే బీజేపీ, జేడీయూతో కలిసి పనిచేస్తాడా ? లేక వాటికి వ్యతిరేకంగా పోరాడతాడా ? వేచిచూడాలి.
This post was last modified on July 29, 2024 10:58 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…