ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, 36 మందిని హత్య చేశారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగాడు. ఏపీలోని అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు ధర్నా స్థలికి విచ్చేసి మద్దతు పలికాయి. అయితే ఈ ధర్నాను బీఆర్ఎస్ ఏ మాత్రం పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ఉందన్న ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తున్నాడని, వైసీపీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడంతో జగన్, కేసీఆర్ ల మధ్య దూరం పెరిగిందా ? ఇండియా కూటమికి జగన్ దగ్గరవ్వుతున్నాడన్న అసంతృప్తితోనే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా ? అన్న చర్చ మొదలయింది.
జగన్ ధర్నాకు పశ్చిమబెంగాల్ లోని టీఎంసీ, యూపీలోని సమాజ్ వాదీ పార్టీ, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, వీసీకే, మహారాష్ట్రలోని శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ, ఢిల్లీ, పంజాబ్ లలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు పలికినా ధర్నా వైపు బీఆర్ఎస్ ఎంపీలు కన్నెత్తి చూడలేదు.
కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు జగన్ ధర్నాకు మద్దతు పలకడంతో జగన్ పార్టీ కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు జాతీయ స్థాయిలో మొదలయ్యాయి. అయితే మొదటి నుండి ఎన్డీఎ కూటమి, ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ రెండు కూటములకు దూరంగా ఉంటున్నారు.
జగన్ ధర్నాకు వచ్చే పార్టీల సమాచారం ముందే తెలిసి ఉండడంతో జగన్ ధర్నాకు వెళ్లొద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించలేదు. అయితే ఆ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యుల బలం ఉంది.
This post was last modified on July 27, 2024 5:29 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…