రాజకీయ నాయకులు అన్నాక ప్రెస్ మీట్లు పెట్టడం సహజం. ఒక్కక్కరు ఒక్కొక్క విధంగా మీడియా ప్రతి నిధులతో మాట్లాడతారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా మీడియాతో కలసే ఉంటారు. జనసేన అధినే తపవన్ కూడా మీడియాకు దూరంగా అయితే ఏమీ ఉండరు. ఏపీ మాజీ సీఎం జగన్ మాత్రం మీడియాకు కడు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. 2014-19 మధ్య విపక్షంగా ఉన్నా.. 2019-24 మధ్య అధికార పక్షంగా ఉన్నా.. కూడా జగన్ మీడియా ముందుకు వచ్చింది.. రెండు, మూడు సందర్భాలు మాత్రమే.
విపక్షంలో ఉన్నప్పుడు కూడా.. జగన్ మీడియాను పెద్దగా పట్టించుకోలేదు. ప్రజల్లోనే ఉన్నారు. వారితోనే సంభాషించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఒకే ఒక్కసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడా రు. తర్వాత.. 2021లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని తప్పుపడు తూ.. ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు జగన్. ఆ తర్వాత.. తరచుగా బహిరంగ సభలకు వెళ్తుండడం అక్కడే మాట్లాడుతుండడంతో సరిపుచ్చారు.
ఇక, ఇప్పుడు విపక్షంలోకి వచ్చారు. 11 మందితో కలిసి ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించు కోలేక పోయారు. ఈ క్రమంలో తొలిసారి రాష్ట్ర మీడియాతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. విపక్షంలోకి వచ్చి న తర్వాత, సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని తర్వాత.. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత… జగన్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ఇదే కావడం గమనార్హం. అయితే.. దీనిలోకొన్ని విశేషాలు.. ఆశ్చర్యాలు కూడా ఉన్నాయి. ఇవి మీడియాలో తెగ చర్చను పెంచేశాయి.
— ప్రెస్ మీట్‌కు వచ్చేవారు.. కెమెరాలు తీసుకురావద్దు (సాధారణంగా మీడియా కెమెరాలతోనే కదా కవర్ చేస్తుంది. కానీ.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ కావడంతో ఆ ఇంటి పరిసరాలను వీడియో తీస్తారేమనని జగన్ భావించి ఉంటారు. అందుకే కెమెరాలకు నో ఎంట్రీ)
— తొలిసారి తాడేపల్లిలోకి మీడియా ఎంట్రీ: ఇప్పటి వరకు మీడియాకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. తాడేప ల్లి క్యాంపు కార్యాలయంలోకి మీడియా వెళ్లేందుకు ముందస్తు అనుమతులు ఉండాలి. అసలు రానివ్వరు కూడా. కానీ.. ఫస్ట్ టైమ్.. జగన్ ప్రెస్ మీట్ పెడుతున్న నేపథ్యంలో మీడియాను అనుమతించారు. ఓన్లీ విలేకరులు మాత్రమే రావాలని (పార్టీ బీట్ చూసేవారు మాత్రమే) వైసీపీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. సో.. ఇదీ జగన్ ప్రెస్ మీట్ విశేషాలు.
— సాధారణంగా ప్రెస్ మీట్ అయ్యాక విశేషాలు ఉంటాయి. కానీ, జగన్ వైఖరే చిత్రం కదా.. ఆయన ప్రెస్ మీట్ కూడా విశేషంగా మారి.. వార్తగా తయారైంది!!
This post was last modified on July 26, 2024 3:08 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…