మాటకు మాట.. అన్నట్టుగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గుం టూరు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్‌ను హత్య చేసిన జిలానీకి.. స్థానిక వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారి కుటుంబంలో జరిగిన వేడుకలకు జిలానీ హాజరయ్యారని.. ఎమ్మెల్యే సతీమణికి ఆయన కేక్ తినిపించిన సందర్భం ఉందన్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యేతోనూ.. జిలానీకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ.. కొన్ని ఫొటోలను మీడియాకు చూపించారు. జిలానీతో సత్సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే కుటుంబంపైనా కేసులు ఎందుకు నమోదు చేయలేదని జగన్ ప్రశ్నించారు.
ఆయన ఆరోపణలు చేసి .,. 24 గంటలు గడవకుండానే.. కూటమి సర్కారు నుంచి అంతే ఎదురు దాడి ఎదురైంది. జగన్ బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్‌కు సంబంధించిన ఫొటోలను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
సునీల్ యాదవ్‌తో జగన్ సతీమణి.. వైఎస్ భారతి దిగిన ఫొటోలను.. అదేవిధంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డి దిగిన ఫొటోలను.. ఇతర కుటుంబ సభ్యులు సునీల్ యాదవ్‌తో ఉన్న ఫొటోలను జత చేసి.. జగన్ చేసిన వ్యాఖ్యలతో కలిపి ప్రచారం ప్రారంభించారు.
సునీల్ యాదవ్‌తో ఉన్న అందరిపైనా.. కేసులు నమోదు చేయాలి కదా.. ఇప్పుడేమంటవ్? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తు న్నారు. అంటే.. జగన్ ఒకటంటే.. కూటమి వంద వ్యాఖ్యలతో.. వందల కొద్దీ సమాచారంతో విరుచుకుప డుతుండడం గమనార్హం. ఇది రాజకీయంగా ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates