ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం రెడీ అయింది. సోమవారం నుంచి సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులు వెళ్తారా? లేదా? అనే విషయం ఇంకా సదిగ్ధంలోనే ఉంది. అయితే.. ఒకవేళ వెళ్లినా.. సభలో పెద్దగా గళం వినిపించే నాయకులు .. ఫైర్ అయ్యే నేతలు ఎవరూ లేరు. దీంతో ఈ సారి సభలో ఫైర్ ఉండకపోగా.. వైసీపీ ‘కూల్’`గానే వ్యవహరించనుంది. ఎందుకంటే.. 11 మంది ఎమ్మెల్యేల్లో.. జగన్, పెద్దిరెడ్డిలను పక్కన పెడితే.. మిగిలినవారిలో ఎవరూ ఫైర్ బ్రాండ్స్ లేకపోవడం గమనార్హం.
ఒకప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో కూర్చున్నా.. ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించడమే కాదు.. నిప్పులు చెరుగుతూ మాట్లాడిన నాయకులు చాలామంది ఉన్నారు. రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ కొడాలి నాని వంటివారు కొందరు.. ఫైర్ బ్రాండ్స్‌గా సభలో చెలరేగిపోయిన సందర్భా లు అనేకం ఉన్నాయి. ఇది.. సభా వ్యవహారాలను పీక్ స్థాయికి తీసుకువెళ్లిన పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఈ సారి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. జగన్ అంత ఫైర్ కాదు. ఏదో మాట్లాడతాడే కానీ.. ఫైర్ బ్రాండ్స్ మాదిరిగా మాటకు మాట చెప్పే అలవాటు లేదు.
ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. అసలు.. మాటకు మాట చెప్పే పరిస్థితి లేదు. ఆయన అలవోకగా మాట్లాడే నాయకుడు కూడా కాదు. ఇక, ఈయన సోదరుడు ద్వారకనాథ్‌రెడ్డి కూడా.. ఇంతే. ఆలూరు నుంచి విజయం దక్కించుకున్న విరూపాక్షి.. కొత్త. సో.. ఆయన మౌనంగానే ఉంటారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొంత మాటకారే అయినా.. ఫైర్ అయితే కాదు. కాబట్టి సభలో కొంత వరకు మాట్లాడే అవకాశం ఉంది.
పాడేరు నుంచి గెలిచిన విశ్వేశ్వరరాజు అసెంబ్లీకి ఫస్ట్ టైమ్ ఎన్నకయ్యారు. సో.. ఆయన కూడా సైలెంటే. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి పెద్ద ఫైర్ బ్రాండ్ కాదు. సైలెంట్ నాయకుడు. అరకు నుంచి గెలిచిన రేగం మత్స్యలింగం.. సభకు తొలి ప్రవేశం. సో.. మౌనంగానే ఉండనున్నారు. బద్వేల్ నుంచి గెలిచిన దాసరి సుధ… స్వతహాగా ఆమె డాక్టర్. దీంతో కన్‌స్ట్రక్టివ్‌గా వ్యవహరిస్తారే.. తప్ప.. నోరు పారేసుకోవడం.. మాటకు మాట చెప్పడం తెలియదు.
మంత్రాలయం నుంచి గెలిచిన బాల నాగిరెడ్డి కూడా సైలెంట్ నాయకుడే. ఎర్రగొండ పాలెం నుంచి గెలిచిన చంద్రశేఖర్.. తొలిసారి సభలో అడుగు పెడుతున్నారు. ఈయన రాజకీయాల్లోనూ కొత్తే. కాబట్టి సభలో ఫైర్ ఉండదు. మొత్తంగా చూస్తే.. వైసీపీ తరఫున గెలిచిన వారిలో ఎవరూ అంత ఫైర్ బ్రాండ్స్ కాదు. దీంతో సభలో వైసీపీ ఈసారి ఫైర్ కాదు.. కూల్ అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates