పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. తాజాగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు.. కేసు విషయంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో బెయిల్ పొందిన పిన్నెల్లిపై తర్వాత.. సీఐ నారాయణ స్వామి, టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్.. శేషగిరిపై హత్యాయత్నం చేశారన్న కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో గతంలో బెయిల్ లభించకపోవడంతోనే.. ఆయనను పోలీసులు జైలుకు పంపించారు. ప్రస్తు తం నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి మరోసారి తనకు బెయిల్ మంజూ చేయాలంటూ.. కోర్టును ఆశ్రయించా రు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిన్నెల్లి తరఫున ఆయన న్యాయవాది.. వాదనలు వినిపిస్తూ.. పిన్నెల్లిపై రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేశారని తెలిపారు. వీటిని కొట్టి వేయాలని కోరుతూ.. మరో పిటిషన్ వేయనున్నట్టు తెలిపారు.
అయితే.. కోర్టు ఈ సందర్భంగా జోక్యం చేసుకుని.. కేసులు ఏమీ సాధారణమైనవి కావని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పిటిషనర్ చరిత్ర అంతా వివాదాలతోనే ఉందని.. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయ ని, హత్యాయత్నం కేసులను కొట్టివేయాలని ఎలా కోరతారని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ తమపై నమోదైన కేసుల్లో రాజకీయ జోక్యం ఉందనే చెబుతున్నారని.. కానీ, నిరూపణ చేసుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ చరిత్ర.. స్పాట్‌లో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన వివరాలను గమనిస్తే.. పిటిషనర్ బెయిల్ కు అర్హుడు కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా.. ఈ నెల తొలి వారంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను జిల్లా జైలులో ఉంచితే.. రాజకీయంగా ఉద్రిక్తతలు ఏర్పడతాయని పేర్కొంటూ.. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు. కొన్నాళ్లకు వైసీపీ అధినేత జగన్ పిన్నెల్లిని పరామర్శించి.. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని సమర్థించారు. ఇప్పుడు ఈ విషయంపై కూడా కోర్టు సీరియస్ కావడం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం గమనార్హం.
This post was last modified on July 18, 2024 10:54 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…