అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. అయితే.. గత వైసీపీ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని కూడా భ్రష్టు పట్టించే పని చేసింది. ఎవరూ ఊహించడానికి కూడా తావు లేకుండా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ విషయం వెలుగు చూసిన తర్వాత.. అందరూ నివ్వెర పోతున్నారు. ప్రస్తుతం ఈ భ్రష్టత్వాన్ని తాజాగా బాధ్యతలు చేపట్టి నూతన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తొలగించారు. దీంతో వైసీపీ మినహా అన్నిరాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాస్వామ్య వాదులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
ఏపీ రాజధాని అమరావతిని కాదని.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయాన్నితెరమీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమించారు. తమ సంగతే కాదు.. రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడాలంటూ..వారు నిరసన వ్యక్తం చేయడం.. పాదయాత్రలు చేయడం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విన్నపాలు సమర్పించారు. అయినా… వీరి మొర ఎవరూ ఆలకించలేదు. దీంతో అసెంబ్లీ ముట్టడికి పలు దఫాలు ప్రయత్నించారు. దీనిని వైసీపీ సర్కారు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఏకంగా అప్పటి గుంటూరు ఎస్పీ లాఠీ పట్టుకుని రైతులపై విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ గేటుకు గోడ
రైతులు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అసెంబ్లీకి ఉన్న రెండో గేట్ ను మూసేసింది. మూసేయడమే కాదు..ఏకంగా 12 అడుగుల మేరకు.. పటిష్టమైన గోడను కూడా కట్టేసింది. నిజానికి కొత్తగా అసెంబ్లీని చూసేవారు.. అసలు ఇక్కడ గేటు ఉందా? అంటే నమ్మలేని పరిస్థితి ఏర్పడేలా గోడను నిర్మించేశారు. ఫలితంగా అసెంబ్లీ రెండో గేటు మూతపడింది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా.. నిన్న మొన్నటి వరకు కూడా గుర్తించలేకపోయారట. అంతగా అసలు గోడతో కలిసిపోయేలా ఈ గేటును మూసేసి మరీ గోడను నిర్మించేశారు.
అయ్యన్న అప్పటికప్పుడే!
కాగా, అసెంబ్లీ గేట్ 2కు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్మించిన గోడ వ్యవహారం రెండు రోజుల కిందట స్పీకర్ అయ్యన్నకు తెలిసింది. రైతులు కొందరు వచ్చి.. ఆయన ముందు మొర పెట్టుకున్నారు. దీంతో అప్పటికప్పుడే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన స్పీకర్.. తాజాగా బుధవారం వైసీపీ ప్రభుత్వం నిర్మించిన గోడను కూల్చేసి.. గేట్లు తెరిపించారు. ప్రజాస్వామ్య దేవాలయానికి అడ్డంకులు ఉండరాదని స్పీకర్ పేర్కొనడం గమనార్హం. నిరసనలు, ధర్నాలు అడవుల్లో ఎవరూ చేయరని.. మనుషుల మధ్యే చేస్తారని.. శాంతి యుత ధర్నాలు, నిరసనలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీ గేటు 2కు కట్టిన గోడను కూల్చి వేయడంతో అమరావతి రైతులు.. అసెంబ్లీకి ఊపిరివచ్చిందని సంబరాలుచేసుకోవడం గమనార్హం. వైసీపీ హయాంలో జరిగిన ఇలాంటి లీలలు ఎన్ని ఉన్నాయో.. మున్ముందు ఎన్ని చూడాలో అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on %s = human-readable time difference 9:43 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…