తమ్ముడు తనవాడే అయినా.. ధర్మం చెప్పాలన్నట్టుగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి కడప జిల్లాలో రెండు రోజుల కిందట.. టీడీపీకి చెందిన కొందరు నాయకులు.. వైసీపీ మద్దతు దారుగా ఉన్న మంజుల అనే ఓ మహిళ పొలంపై దాడి చేశారు. ఆమెకు చెందిన 8 ఎకరాల్లోని చీనీ(బత్తాయి) తోటలను అడ్డంగా నరికేశారు. దీనిపై మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. రెండు రోజులైనా.. తనకు న్యాయం జరగలేదని.. సదరు మహిళ.. సీఎంవో కార్యాలయానికి ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన .. సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. అంతే.. చేసింది తనవారే.. అని తెలిసినా.. చంద్రబాబు ఎక్కడా వారిని వెనుకేసుకురాలేదు. వెంటనే స్పందించారు. అంతేకాదు.. ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎన్నికలకు ముందు వరకేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బత్తాయి తోటల నరికివేతను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.
మంజుల బత్తాయి తోటల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అంతేకాదు.. ఈ ఘటనలో ఎవరు ఉన్నా విడిచి పెట్టద్దని జిల్లా అధికారులను ఆదేశించారు. జీవితాలను నాశనం చేసే ఇలాంటి ఘటనల విషయంలో ఇకపై ఫిర్యాదులు కూడా రాకుండా చర్యలు ఉండాలన్నారు.
అప్పట్లో అంతా రివర్స్!
గత వైసీపీ పాలనలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నిక ల తర్వాత.. తమ వారికి ఓటేయలేదంటూ.. గ్రామాలకు గ్రామాలనే వైసీపీ నాయకులు వేధించారు. నీళ్లు ఇవ్వకుండా.. చెత్త ఎత్తకుండా.. వర్షం వచ్చినా.. కూడాప ట్టించుకోకుండా.. విద్యుత్ సరఫరాను నిలిపివేసి వేదించిన ఘటనలు అనేకం ఉన్నాయి. వీటిపై గ్రామస్థులు ఫిర్యాదు చేసినా.. అప్పటి వైసీపీ నాయకులు కానీ.. సీఎం కానీ.. పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు తన వారే ఈ కేసులో ఉన్నారని తెలిసి కూడా.. చంద్రబాబు చర్యలకు ఆదేశించడం గమనార్హం.
This post was last modified on July 17, 2024 10:16 am
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…