విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అవకతవకలపై విచారణ జరిపేందుకు ఓ కమిషన్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విద్యుత్ విచారణ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది. అయితే, ఆ విచారణ పూర్తికాకముందే నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ కమిషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
ఈ నేపథ్యంలోనే ఈరోజు కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిని అతిక్రమించిందని, ఆ ఒప్పందాలపై ట్రైబ్యునల్ ఉండగా న్యాయ విచారణ ఎలా చేస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా విచారణ జరుపుతున్న ఆ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని, మీడియా ముందు అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారని సిజెఐ ప్రశ్నించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
ఇక, విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ కీలక ఆదేశాలు చేశారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. సోమవారంలోగా కొత్త చైర్మన్ ను నియమిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
అయితే, తాను ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని జస్టిస్ నరసింహారెడ్డి వివరణనిచ్చారు. రోజు మార్చి రోజు కమిషన్ ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేసిందని, మీడియా సమావేశం పెట్టకుంటే పత్రికల్లో ఊహాజనిత సమాచారం ప్రచురించడంతో తాను బ్రీఫింగ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు తాను కమిషన్ నుండి తప్పుకుంటున్నానని అన్నారు.
This post was last modified on July 17, 2024 10:13 am
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…