Political News

జ‌గ‌న్‌కు షాకిచ్చిన చంద్ర‌బాబు కేబినెట్‌

ఏపీలోని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రివ‌ర్గ బృందం విప‌క్ష నేత జ‌గ‌న్ కు భారీ ఇచ్చింది. గ‌తంలో ఆయ‌న ప్ర‌బుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసింది. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో తొలి అజెండా అంశంగా.. దీనిని ఉంచారు. దీనికి కేబినెట్ ఏక‌గ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఈ చ‌ట్టాన్ని తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నేర‌ద్దు చేస్తామ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. మ‌లి సంత‌కం కూడా దీనిపైనే చేస్తాన‌ని చెప్పారు.

అన్న‌ట్టుగానే మూడో సంత‌కం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు పైనే చేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి వ‌ర్గంలో నూ చ‌ర్చించి.. దీనిని ర‌ద్దు చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ చ‌ట్టం ర‌ద్దుకు సంబంధించిన బిల్లును ప్ర‌వేశ పెట్టి ఆమోదించ‌డంతో పూర్తిగా ఈ చ‌ట్టం క‌నుమ‌రుగు కానుంది. అయితే.. ఈ చ‌ట్టం కింద ఇప్ప‌టికే 20 వేల మందికి ప‌ట్టాలు ఇచ్చారు. వాటిని కూడా ర‌ద్దు చేసి స‌మీక్షించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ చట్టం స్థానంలో కొత్త చ‌ట్టాన్ని తీసుకురానున్నారు.

ఇక‌, ఉచిత ఇసుక‌ను పూర్తిస్థాయిలో ఆమోదిస్తూ.. మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం 20 జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ప‌థ‌కాన్ని మున్ముందు.. అన్ని జిల్లాల‌కు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టి ప‌రిస్థితిలోనూ వేళ్లు పెట్టొద్ద‌నే విధానానికి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. అక్టోబ‌రు నుంచి మ‌రింత‌గా ఇసుక అందుబాటులోకి వ‌స్తుంద‌ని, అప్పుడు అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌ని మంత్రి మండ‌లి తీర్మానించింది.

ఇక‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు 2 వేల కోట్లు అప్పు రూపంలో తెల్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్ర‌తిపాద‌న గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కారు చేసిందే అయినా.. ఇప్పుడు దీనిని అనుస‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంత్రి వ‌ర్గం ఏక‌గ్రీవంగా నిర్ణ‌యించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక‌, మంత్రులు ఎవ‌రూ వివాదాల జోలికి పోకూడ‌ద‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు.

This post was last modified on July 16, 2024 9:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago