ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ దఫా వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్ట నున్నారు. వైసీపీ హయాంలో జూలై నెల ఆఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించుకుంది.
అయితే.. ఈ సమావేశాలకు వైసీపీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్రకారం.. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు.. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించే అంశాలపై.. బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వహిస్తుంది. దీనికి అసెంబ్లీ సభాపతిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వం వహిస్తారు. అదేవిధంగా సభలో ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు.
సంప్రదాయం ప్రకారం.. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా దక్కలేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చర్చ జరిగింది. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆహ్వానిస్తామని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాలని.. వచ్చినా.. రాకపోయినా.. వారి ఇష్టానికే వదిలేయాలని మంత్రులు కూడా చెప్పినట్టు తెలిసింది.
సంప్రదాయాన్ని మాత్రం మనం గౌరవిద్దామని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని.. అయితే.. స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఇది ఉండాలని.. నిర్ణయించారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 16, 2024 6:59 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…