రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన నెల రోజుల పాలనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు.. సమీక్షించారు. పాలనలో అనుసరించాల్సిన పద్ధతులను.. ఇప్పటి వరకు సాగించిన పాలనను కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎక్కువ
మంది ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తే.. బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇదే అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా తెలిపారు. రాష్ట్ర కీలక సమస్యల పరిష్కారం ఎలా ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. తాము నిర్వహించిన ప్రజాదర్బార్‌లో నిత్యం వేలాది మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్టు టీడీపీ మంత్రులు కూడా చెప్పారు. ఇక, జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణిలో కూడా ఎక్కువ మంది ప్రజలు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతున్నారని పవన్ కల్యాణ్ సహా ఇతర జనసేన పార్టీకి చెందిన మంత్రులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే.. జనసేన పార్టీ కార్యాలయాల్లో నాయకులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారి చేసినట్టు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున కూడా.. చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న సూచనల నేపథ్యంలో చంద్రబాబు కూడా పార్టీ కేంద్ర కార్యాల యంలో రొజుకోక మంత్రి చొప్పున ఉండి.. ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి.. వాటిని పరిష్కరిం చాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ నెల నుంచే మంత్రులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉండి.. ప్రజల నుంచి సమస్యలు తీసుకోవడంతోపాటు.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates