ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోనే అధికంగా గాజువాక శాసనసభ స్థానం నుండి 95,235 ఓట్ల అత్యధిక మెజారిటీతో టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు విజయం సాధించాడు. మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష్య పదవిని కట్టబెట్టారు.
అయితే పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీ సాధించినా నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు సాధించి జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడయింది. తన నియోజకవర్గంలో ఆయన 70.23 శాతం ఓట్లు సాధించడం విశేషం. అయితే ఆయనకు దక్కిన మెజారిటీ మాత్రం 64,594. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న శ్రీనివాస్ 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గత ఏడాది డిసెంబరులో జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు.
మహిళా ఎమ్మెల్యేలలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి 64.21 అత్యధిక శాతం ఓట్లు సాధించగా, పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు 69.30 శాతం, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి పొంగూరు నారాయణ 68.99 శాతం ఓట్లు సాధించారు.
అత్యల్పంగా 0.19 శాతం ఓట్లతో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, 0.47 శాతం ఓట్లతో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అత్యల్ప ఓట్లతో విజయం సాధించిన వారిలో ఉన్నారు.