ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ అధికారం అందుకోవడం కోసం ఎన్డీఎ పక్షాల మద్దతు అవసరం అయింది. సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమితో కలిపి కూడా బీజేపీకి తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో ఎన్డీఏతర పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 20 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113. ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 101 సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన మేజిక్ ఫిగర్ కు 12 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి ఉంటుంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, అన్నా డీఎంకేకు 3 సభ్యుల బలం ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి 4, బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి కేవలం 9 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీ ఎవరి సాయం కోరుతుంది ? ఎవరు సహకరిస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates