Political News

ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఖాళీగా ఉన్న భూములు మొదలు భూమి లోపల ఉన్న సహజ వనరుల వరకు వేటినీ వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలు అర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో వైసీపీ పాలలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఒక నమ్మకంతో ఐదేళ్లు పాలన చేయాలని ప్రజలు అధికారాన్ని ఇచ్చారని, కానీ ప్రజాధనానికి, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండకుండా పెత్తందారీతనంతో ఇష్టారాజ్యంగా ఉండమని ప్రజలు చెప్పలేదని జగన్ పాలనను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సహజ వనరుల దోపిడీలో పంచభూతాలను మింగేసి పరిస్థితికి వైసీపీ నేతలు వచ్చారని దుయ్యబట్టారు. అభివృద్ధి క్రమంలో ఏ ప్రాంతంలో అయినా భూములకు విలువ పెరుగుతుందని, అటువంటి భూములపై వివాదాలు సృష్టించి వాటిని కొట్టేయాలన్న పన్నాగాన్ని వైసీపీ నేతలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. అడవుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక శాఖను, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉందని గుర్తు చేశారు. అయితే పర్యావరణానికి మేలు చేసే అడవులను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి వైసీపీ పాలనలో ఉందని విమర్శించారు.

రికార్డుల్లో అన్నీ ఉండవని, కొంతవరకే సమాచారం ఉందని చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి వైసీపీ నేతలు దోచుకున్న శాతం కంటే తన దగ్గర తక్కువే సమాచారం ఉందని అన్నారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారని, వైసీపీ కార్యాలయాల కోసం ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల స్థలాల కోసం కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూముల సరిహద్దులే మార్చేశారని, ఇక ఈ భూ అక్రమాలకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. వేరెవరికి భూములపై హక్కులు లేకుండా భూములు దోచుకోవడానికి ఈ యాక్ట్ తో రాచబాట వేసుకున్నారని చెప్పారు.

రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములను అక్రమంగా జగనన్న ఇళ్లకు ఇచ్చారని, అందులో వాటా కొట్టేశారని ఆరోపించారు. కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను లక్ష రూపాయలు చొప్పున శారదా పీఠానికి కట్టబెట్టారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వీళ్ళ సొంత సొమ్ము అయినట్లు సాహి హియరింగ్ కేర్ సంస్థకు ఎకరా ఉచితంగా దానం చేశారని విమర్శించారు. ఇక ఒంగోలులో 100 కోట్ల విలువ చేసే భూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇళ్ల పట్టాల విషయంలో మూడు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన పది వేల ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు.

ప్రజలంతా తమ భూములు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలని గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగనన్న శాశ్వత భూ హక్కు పేరుతో ఏం చేసిందో తెలియదని చంద్రబాబు అన్నారు. ఒకవేళ తమ భూములు, ఆస్తులు కబ్జాలకు గురైనట్లు తెలిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని చెప్పారు గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఏపీలో కూడా తెస్తామని, భవిష్యత్తులో కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

This post was last modified on July 16, 2024 7:52 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

59 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

7 hours ago