అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనిస్తే చాలా ఆవేదన ఆందోళన వ్యక్తం అవుతుందోని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో పార్టీ పాలన సాగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాలు పార్టీ మనుగడ ఒకింత ప్రశ్నార్థకంగా మారనుంది.
ముఖ్యంగా 175 స్థానాల్లో గెలుస్తామని, అధికారం తమదేనని ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు 11 స్థానాలు వచ్చిన నేపథ్యంలో ప్రజలకు మొహం చూపించలేక పార్టీ నాయకులను బుజ్జగించలేక సతమతమవుతున్నారు.
ఇది ఒక సందిగ్ధమైన పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేల పరంగా చూస్తే ఎంతమంది వైసీపీలో ఉంటారు? ఎంతమంది జగన్‌కు దూరమవుతారు? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా వీరిలో వీరవిధేయులు ఉన్నారని అనుకున్నా.. నలుగురైదుగురు మాత్రం గోడ దూకేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం స్పష్టంగా వినిపిస్తోంది.
ఈ నేపధ్యంలో వారిని కాపాడుకునే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తారా? చేయరా? అనేది ఒక ప్రశ్న. వారి సంగతి ఎలా ఉన్నా అసెంబ్లీకి వెళ్లడం వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు మరో ప్రశ్న. ఇది జగన్ రాజకీయ భవితవ్యానికి పెను సవాల్‌గా మారింది.
అసెంబ్లీకి వెళ్తే అవమానాలు ఎదుర్కోవాలి. వెళ్తే టిడిపి నాయకులు, ప్రభుత్వం నుంచి కూడా అవమానాలు ఎదుర్కోవాలి. జగన్ తన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను గతంలో చంద్రబాబును ఏ విధంగా అయితే గేలిచేశారో.. ఇప్పుడు టిడిపి నాయకులు అదేవిధంగా జగన్ ను గేలిచేస్తారు. వీడియోలు ప్రదర్శిస్తారు. వ్యాఖ్యలు చేస్తారు.
గత ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఎండగడతారు. దీన్ని భరించాలి. పోనీ దీన్ని భరించలేము అని అసెంబ్లీకి దూరంగా ఉంటే గతంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నాడని ప్రచారం చేశారో అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీ ఏర్పడుతుంది.
11 మంది ఎమ్మెల్యేలు వచ్చారని, అధికారం రాలేదు కాబట్టి అసెంబ్లీకి రాలేదని ప్రచారం జగన్ ను చుట్టుముడుతుంది, దీని నుంచి తప్పించుకోవడం మరింత కష్టం. ఇది ప్రజల్లోకి వెళ్తుంది. అసెంబ్లీలో ఉంటే ఆయన వరకు పరిమితం. అసెంబ్లీకి వెళ్లకపోతే నేరుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు ప్రచారం చేస్తారు. ఇది మరో పెద్ద సమస్య. ఒక టీడీపీ అనే కాదు ఆయనకు పొంచి ఉన్న మరో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా సోదరి షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మరింత కత్తుల నూరుతున్నారు. ఎన్నికలకు ముందు ఆమె విపరీత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీని భవిష్యత్తులో ఏవిధంగా ఆమె టార్గెట్ చేస్తారు అనే విషయాన్ని స్పష్టం చేశాయి. వైసీపీ అంటే వైయస్సార్ కు సంబంధం లేదని, వైసీపీ అంటే యువజన రైతు శ్రామిక పార్టీ తప్ప వైయస్సార్ పార్టీ కాదని చెప్పారు. వైయస్సార్ కు వైసిపి కి సంబంధం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ ఐదేళ్ల పరిపాలనను కూడా ఎండగట్టారు. విధ్వంసపాలన, కక్షపూరిత రాజకీయ హత్యలు చేసిన పాలన అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు భవిష్యత్తులోనూ ఆయా విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పడం ద్వారా వచ్చే ఐదేళ్లు కూడా వైసీపీ తాను వదిలిపెట్టేది లేదని షర్మిల పరోక్షంగానే హెచ్చరించినట్టు అయింది.
అంటే ఒక వైపు టిడిపి, మరోవైపు షర్మిల కూడా వచ్చే ఐదు సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఎలాంటి వెనుకడుగు వేసేది లేదని స్పష్టంగా తెలుస్తోంది. మరో ముఖ్య విషయం ఇప్పుడు ఐదేళ్లు తట్టుకున్నా.. వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీ పరిస్థితి ఏంటి అనేది చూస్తే అది కూడా కష్టమేనని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరుగుతుండడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. డౌన్ టు ఎర్త్
అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.
ఒకవైపు జీతం తీసుకోకపోవడం, మరోవైపు విలాసాలకు దూరంగా ఉండటం, నిత్యం సమీక్షలు చేస్తుండడం.. సినిమాలను తగ్గిస్తానని చెప్పడం ద్వారా ప్రజలు తన నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఆయన చేరువు అవుతానని సంకేతాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలనాటికి జనసేన మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు లేదా ఒంటరిగానే పోటీ చేయొచ్చు. ఏం చేసినా పవన్ ఇమేజ్‌ను పెంచుకుంటున్న నేపథ్యంలో అది పార్టీకి ఉపయోగకరంగా మారుతుంది.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీకి అధికారం దక్కుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు కాదు వచ్చే ఐదైళ్లలను కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటం, ముఖ్యంగా విధ్వంస పాలన అనే ముద్ర పడిపోవడం వంటివి జగన్ పాలనలో ఆయన చేసిన నిర్లక్ష్యం కారణంగా వచ్చిన అపవాదులను సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఇప్పటికైనా ప్రజలకు చేరవు కావాలి. మీడియా ముందుకు రావాలి. నాయకులను కలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలవబతం చేయాలి. నేను ఉన్నాను నేను విన్నాను
అన్నమాట నిజం చేయాలి. అలా కాకుండా ఇంటికే పరిమితమై ఇంట్లోనే కూర్చుంటాను అంటే ప్రత్యర్థుల దాడిలో మాడి మసైపోవడం ఖాయమని పరిశీలకులు సూచిస్తున్నారు. అంతెందుకు తాజాగా షర్మిల ఓ రేంజ్‌లో వైసీపీపై నిప్పులు చెరిగినా.. ఏ ఒక్క నాయకుడు కూడా షర్మిల వ్యాఖ్యలు ఖండించ లేదంటే వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తు కూడా ఇలా ఉండకుండా ఉండాలంటే.. జ గన్ జాగ్రత్త పడక తప్పదు.
This post was last modified on July 13, 2024 6:34 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…