వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతలను మించి జగన్ అండ్ కోను ఇబ్బంది పెట్టిన నాయకుడు రఘురామకృష్ణంరాజు. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఏడాది తిరక్కముందే ఆయన రెబల్ నేతగా మారారు. వైసీపీలో ఉంటూనే మా ముఖ్యమంత్రి, మా పార్టీ అంటూ రచ్చబండ కార్యక్రమంలో జగన్ అండ్ కో వైఫల్యాలు, అక్రమాలన్నింటినీ బయటపెట్టారాయన.
దీంతో జగన్ ఆయన మీద కసి పెంచుకుని ఒక కేసులో జైల్లో పెట్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయన్ని హింసించినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి జగన్‌కు గట్టి పంచ్ ఇచ్చారు రఘురామ. విజయానంతరం కూడా ఆయన జగన్ అండ్ కోను వదలట్లేదు. అసెంబ్లీలో జగన్‌కు ఇచ్చిన కౌంటర్ల గురించి తెలిసిందే.
కాగా రఘురామ తాజాగా జగన్‌తో పాటు బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరైన కేటీఆర్‌ను ఒకేసారి టార్గెట్ చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎలా ఓడిపోయిందో అర్థం కావడం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎందుకు ఓడిపోయామో తెలియని స్థితిలో బీఆర్ఎస్ ఉందని.. ఆ పార్టీది కూడా వైసీపీ స్థితే అని.. మిత్రధర్మం పాటిస్తూ వైసీపీ ఓటమి గురించి ఆయన ఆశ్చర్యపోయారని.. కానీ జగన్ ఆ పార్టీ ఓడిపోయినపుడు పట్టించుకోని విషయం మరిచిపోతున్నారని రఘురామ అన్నారు.
బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయినపుడు జగన్ ఒక్క మాటా మాట్లాడలేదని.. ఇంత షక్కగా పరిపాలించినా ఓడిపోయారంటేని ఒక్క మాటా అనలేదని జగన్ స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఆయన కేటీఆర్‌కు ఆ సంగతి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తామెందుకు ఓడిపోయామో తెలియక జగన్ ఇంకా బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే కేటీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నారని.. కానీ వారి పార్టీని పట్టించుకోని జగన్ గురించి వాళ్లెందుకు ఆందోళన చెందుతున్నారని రఘురామ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates