రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైంది. గత నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజుల్లో ఆయన వేసిన అడుగులు పాజిటివిటీని పెంచాయనే చెప్పాలి.
వచ్చి రావడంతోనే సహజంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేస్తారని విపక్షం ఎదురు చూసింది. కానీ ఒక్కొక్కటి అమలు చేస్తూ నిదానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయటం చంద్రబాబు సీనియారిటీకి అద్దం పట్టింది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది, దీనికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనే స్పష్టమైన సూచనలను ఆయన పంపించారు.
వచ్చీ రావడంతోనే పోలవరంలో పర్యటించారు. పోలవరం సమస్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకొచ్చారు. పరిశీలన చేయిస్తున్నారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపించగలిగారు.
అనంతరం అమరావతి రాజధానులో పర్యటించారు. అమరావతి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? ఏం చేయాలి? అనేది సమీక్షించారు. ప్రజలకు స్వేత పత్రం విడుదల చేశారు. అదేవిధంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు.
కేంద్రానికి కూడా నివేదికలు సమర్పించారు. అమరావతికి సాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటూ ఆయన అర్జీలు పెట్టుకున్నారు. తద్వారా చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అన్న సంకేతాలను బలంగా పంపించగలిగారు.
ఇక, పెంచిన పింఛన్లను ఠంచనుగా పంపిణీ చేయించారు. వాలంటీర్లు ఉంటే తప్ప పింఛన్లను అందించలేమని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాలంటీర్లు లేకపోయినా వ్యవస్థ ఆగదని, పేదలకు. లబ్ధిదారులకు మేలు జరుగుతుందని ఆ దిశగా తాము పని చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు కచ్చితంగా చేసి చూపించారు. అదేవిధంగా ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున పెంచిన నగదును ఇచ్చారు.
ఇక ఉద్యోగుల విషయానికొస్తే వారు కూడా సంతోషించేలా ఒకటి రెండు తారీకుల్లోనే వేతనాలను పూర్తిస్థాయిలో అందించగలిగారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పింఛన్లు సకాలంలో ఇవ్వగలిగారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు అందించాయి.
మరో ముఖ్యమైన విషయం ఉచిత ఇసుక అందించడం. ప్రభుత్వం వచ్చి నెలరోజులు కూడా గడవకముందే చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుకను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
తక్కువ ఖర్చుతో కేవలం రవాణా, కూలీ చార్జీలు చెల్లించడం ద్వారా ప్రజలకు మెరుగైన విధానంలో ఇసుకను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇది భవన నిర్మాణ రంగాన్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితిని కల్పించింది.
తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై సానుకూల ధోరణి మరింత పెరిగేలా చేసింది. ఈ నెల రోజుల్లో అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా చంద్రబాబు వేసిన అడుగులు భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు వెళుతుంది అనే భావనను సాధారణ ప్రజల నుంచి మేధావులు వరకు కూడా అంగీకరించేలా చేయడం గమనార్హం.
This post was last modified on July 10, 2024 4:09 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…