ఏపీలో బీజేపీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త అర్థం చెప్పారు. బీ-అంటే బాబు(సీఎం చంద్రబాబు), జే-అంటే జగన్ (మాజీ సీఎం), పీ-అంటే పవన్ (డిప్యూటీ సీఎం) అని రేవంత్ వ్యాఖ్యానించారు. వీరి వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్పారు. ఇక, ఎలాంటి పొత్తులు లేకపోయినా.. మోడీ ముందు ‘జీ హుజూర్’ అంటూ.. చేతులు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వీరంతో మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలనే కొనసాగుతోందన్నారు.
దీంతో ప్రశ్నించేవారు.. ప్రజా సమస్యలు పట్టించుకునేవారు కూడా కనిపించడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్లు ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ప్రజలకు ఏ కష్టమోచ్చినా.. ఈ ‘బీజేపీ’ నేతలు ఒక్కరూ స్పందించరని.. కానీ, షర్మిల మాత్రం స్పందిస్తారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆమె వెనుక సైన్యంగా.. అండగా తామంతా ఉన్నామన్నారు. షర్మిల ఒంటరి నాయకురాలు కాదన్నారు. ఆమె వెనుక భారీ కాంగ్రెస్ పరివారం ఉందన్నారు. ప్రజల కోసం నిలబడిన షర్మిలకు ప్రజలు కూడా మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని రేవంత్ కొనియాడారు. కాంగ్రెస్ నుంచి కనీసం సర్పంచ్‌ను గెలిపించుకునే సత్తా కూడా లేదని కొందరు ఎద్దేవా చేశారని.. అయినప్పటికీ.. షర్మిల పట్టుదలతో పార్టీ పగ్గాలు చేపట్టారని రేవంత్ తెలిపారు. తన తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి ఆశయం సాధించేందుకు ఆమె తీసుకున్న బాధ్యతలను ప్రతి కార్యకర్త కూడా.. తమవిగా భావించాలని రేవంత్ సూచించారు. అలాంటి షర్మిలకు తాము నూటికి నూరు శాతం అండగా ఉంటామని, ఏ అవసరం వచ్చినా.. రెక్కలు కట్టుకుని వాలిపోతామని చెప్పారు. ఇక్కడకు తనతో పాటు తన మంత్రివర్గం అంతా వచ్చిందని… మీకు అండగా ఉంటామని చెప్పడానికే వచ్చామని రేవంత్ షర్మిలవైపు చూస్తూ వ్యాఖ్యానించారు.
This post was last modified on July 9, 2024 2:12 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…