ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు వైపు ఏపీ నుంచి చంద్రబాబు, అటువైపు తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డిలు.. కీలక రోల్ పోషిస్తారని అందరూ అనుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా చాలా ఆసక్తిగా ఈ మీటింగ్‌ను పరిశీలించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలకమైన 10 అంశాలను అజెండాగా చేసుకున్నారు. అయితే.. దేనిపైనా క్లారిటీ రాకపోవడం.. పట్టు-బిగింపులు విడవకపోవడం గమనార్హం.
ఆది నుంచి నెలకొన్న రాజకీయ ప్రభావం.. ఇప్పుడు కూడా కొనసాగింది. తెలంగాణలో నెలకొన్న విభజన స్థిరాస్తులను ఇచ్చేది లేదని.. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే చెప్పారు. ఇప్పుడు దీనిని రేవంత్‌రెడ్డి కొనసాగించారు. వాస్తవానికి ఆర్టీసీ భవన్ సహా.. లేక్ వ్యూ అతిథి గృహం కీలకంగా మారాయి. వీటిని తమకు పంచాలన్నది.. ఏపీ డిమాండ్. కానీ, దీనికి గత సర్కారు ఒప్పుకోనట్టే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా ససేమరా అంది. స్థిర ఆస్తులు ఏవున్నా కూడా.. తెలంగాణకు దఖలు పడాల్సిందేనని తేల్చి చెప్పారు సీఎం. ఇది విభజన సమస్యల పరిష్కారం విషయంలో మోకాలడ్డుతున్న ప్రధాన సమస్య.
అయితే.. ఇప్పుడు కొంత వెసులుబాటు కల్పిస్తూ.. ఏపీకి అవసరమైతే. స్థలం ఇస్తాం.. మీరు కట్టుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఇది ఏపీకి మరింత భారంగా పరిణమించే అంశంగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కొత్తగా కమిటీలను ప్రతిపాదించడం మాత్రమే ఈ సమావేశంలో జరిగిన మేలైన నిర్ణయంగా చెప్పుకొవచ్చు. ఒకటి మంత్రులతో కూడిన కమిటీ అయితే..రెండోది.. అధికారులతో కూడిన కమిటీ. విబజన చట్టంలోని అంశాలపై నియమ నిబంధనల మేరకు.. అధికారుల కమిటీ చర్యలు సూచిస్తుంది.
ఇక, విభజన చట్టంలో లేని.. తిరుమల, ఓడరేవులు, తీరప్రాంతం వంటి అంశాలపై మంత్రుల కమిటీ సూచనలు చేస్తుంది. వీటిని ఆ ప్రాతిపదికన పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. ఇరు రాష్ట్రాలుకూడా.. చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపాయి. ఇదేసమయంలో కొన్ని అంశాలపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటిపై చర్చకు వచ్చినా.. తీర్పులను బట్టి.. నిర్ణయం తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఇతమిత్థంగా తేల్చింది.. ఏమీ లేకపోయినా.. ఒక సుహృద్భావ వాతావరణం అయితే.. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడడం ఒక్కటే ఆశాజనకంగా మారింది.
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…