తగ్గడం చేత కాకపోతే.. నెగ్గడమూ కష్టమే- ఏ పార్టీకైనా.. ఏ నాయకుడికైనా వర్తించే సూత్రం ఇది. ఈ విష యంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుతో పోల్చుకుంటే.. వైసీపీ అధినేత జగన్ వెనుకబడి పోయారు. చంద్రబాబు ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం.. అవసరానికి తగ్గడం.. నెగ్గడం వంటివి ఆయన రాజకీయ జీవితంలో భాగంగా మారాయి. ఘర్షణలు పెట్టుకున్నా.. సర్దుకు పోయినందునే.. తాజాగా ఆయన పార్టీ విజయం దక్కించుకుని నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
కానీ, జగన్ విషయంలో మాత్రం ఇది కనిపించడం లేదు. ఒక ఓటమి తర్వాత.. మార్పు రావాలి. ఆ మార్పు అభివృద్ది దిశగా ముందుకు నడిపించాలి. అది మేలు చేస్తుంది. కానీ.. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా..జగన్‌లో మార్పు కనిపించడం లేదు. పార్టీ నుంచి జంప్ చేసేందుకు నాయకులు రెడీగా ఉన్నా రంటూ.. ఆయనకు సంపూర్ణ సమాచారం.. అన్ని దిక్కుల నుంచి వినిపిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరులు ఖాళీ అవుతున్నాయని కూడా తెలుస్తోంది.
ఇక, సీమ జిల్లాల్లో రెడ్లు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న సమాచారం కూడా జగన్‌కు తెలుసు. అయినప్ప టికీ.. ఆయన తన పాత ధోరణిని మార్చుకోవడం లేదు. పోతే పోనీ.. అని తాజాగా జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బ్రతిమాలి ఎన్నాళ్లు పార్టీలో కొనసాగిస్తామనికూడా చెప్పారు. ఇది.. పోయే నాయకులకు మరింత బలం చేకూరుస్తుంది. సాధారణంగా.. నాయకుల సైకాలజీని పరిశీలిస్తే.. తమకు ప్రాధాన్యం ఉండాలని, అధినేత దగ్గర మంచి పేరు రావాలని ముందు కోరుకుంటారు.
ఏదైనా సందర్భం వచ్చి.. ఇబ్బందుల్లో ఉంటే.. అధినేత నుంచి.. కొంత స్వాంతన కోరుకుంటారు. ఈ విషయంలో జగన్ ఆ తరహా స్వాంతన వారికి ఇవ్వలేక పోతున్నారు. నన్ను ఎదిరించేంత పెద్ద నేతలా? అని జగన్ భావిస్తున్నారు. గతంలో ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటివారు.. పార్టీ నుంచిదూరమయ్యారు. అయితే.. వీరికి జగన్ నుంచి చిన్న స్వాంతన లభించి ఉంటే.. పార్టీలోనే ఉండేవారు. కానీ, ఆ దిశగా జగన్ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా.. అదే ధోరణిని ఆయన పాటిస్తున్నారు. ఫలితంగా జగన్ కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on July 6, 2024 4:54 pm
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…