ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు మరింత విశ్వాస పాత్రుడు అయ్యారా? ఏపీ సీఎంపై మోడీకి మరింత వాత్సల్యం పెరిగిందా? అంటే.. జాతీయ మీడియా కథనాలు ఔననే చెబుతున్నాయి. దీనికి కారణం.. మోడీ దగ్గర చంద్రబాబు వ్యవహరించిన తీరేనని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జేడీయూ, ఎల్జీపీ వంటివి.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. పట్టుబడుతు న్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని చర్చించాలని కూడా.. నితీష్ కోరుతున్నారు.
ఈ విషయంలో మోడీకిసంకట స్థితి ఏర్పడింది. ఇప్పటికే బిహార్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన తీర్మా నం ఆమోదించేయడంతోపాటు.. కూటమి పార్టీలు.. ఒత్తిడి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఈ పరిణా మం సహజంగానే మోడీకి ఇబ్బందిగా మారింది. అటు ఔననే పరిస్థితి లేదు. ఇటు కాదనే అవకాశం లేదు. సంకీర్ణ సర్కారు ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండానే మోడీతో భేటీని ముగించారు.
నిజానికి ఏపీకి కూడా.. ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. 2014 నుంచి ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో ఇదే విషయంపై మోడీతో చంద్రబాబు రగడకు దిగారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చా రు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన అడగాలని అనుకుంటే.. హోదా పై మోడీ దగ్గర ప్రతిపాదన పెట్టుకోవచ్చు. అంతేకాదు.. బిహార్ సీఎం నితీష్ కుమార్ చేసినట్టు తాను కూడా అసెంబ్లీలో తీర్మానం చేసుకుని.. మోడీపై ఒత్తడి తెచ్చినా.. గతంలో మాదిరిగా మోడీ వ్యతిరేకించే పరిస్థితి.. కయ్యానికి కాలుదువ్వే పరిస్థితి ఉండదు.
అయినా.. చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచన చేశారు. ఇప్పటికిప్పుడు హోదా గురించి ప్రస్తావించి .. కేంద్రం ముందు గొంతెమ్మ కోరికల జాబితా పెట్టడం కంటే.. ముందుగా.. రావాల్సిన పోలవరం నిధులు, రాజధాని నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటివాటిని రాబట్టుకుని.. తర్వాత.. నెమ్మదిగా.. బిహార్‌కు ఇచ్చినప్పుడు ఏపీ విషయాన్ని కూడా కదిపి అప్పుడు ఉభయ కుశలోపరిగా లబ్ధి పొందాలన్న వ్యూహంతో చంద్రబాబు ఆలోచన చేసి ఉంటారని జాతీయ మీడియా చెబుతోంది. ఇది వ్యూహాత్మకమే తప్ప.. హోదాను బాబు వదులుకోలేదన్నది జాతీయ మీడియా మాట.
This post was last modified on July 6, 2024 1:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…