Political News

1000 కోట్ల మైలురాయి సాధ్యమేనా

బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తున్న కల్కి 2898 ఏడి రెండో వారంలోనూ దూకుడు కొనసాగించనుంది. నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ప్రకారమే ఫస్ట్ వీక్ ని 700 కోట్లతో ముగించిన ప్రభాస్ ఇప్పుడు వెయ్యి కోట్ల మైలురాయి మీద కన్నేశాడు. ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే పుష్కలంగా ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వారం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా నోటెడ్ రిలీజులు లేవు. తెలుగులో 14 అనే చిన్న చిత్రం తప్ప ఇంకెవరూ రిస్క్ తీసుకోలేదు. హిందీలో కిల్ కి తెగ పబ్లిసిటీ చేశారు కానీ దానికి ఓపెనింగ్స్ సైతం నమోదు కావడం లేదు. టాక్ వస్తేనే పికప్ ఉంటుంది.

ఈ నేపథ్యంలో కల్కికి కొన్ని సానుకూలాంశాలు పని చేయబోతున్నాయి. మొదటిది టికెట్ రేట్లను సాధారణ స్థితికి తీసుకురాబోతున్నారు. తెలంగాణ జిఓలో అనుమతించిన పెంపుని తగ్గించి సాధారణంగా పాటించే గరిష్ట ధరని అందుబాటులోకి తెచ్చారు. దీని ప్రభావం ఈ వీకెండ్ చాలా పాజిటివ్ గా ఉండబోతోంది. అదనపు షోలకు డిమాండ్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో ఆదివారం దాకా అనుమతులున్నాయి కాబట్టి సోమవారం నుంచి నార్మల్ రేట్లతో టికెట్ల అమ్మకాలు ఉంటాయి. ఇక బాలీవుడ్ లోనూ కల్కి స్పీడ్ జోరుగానే ఉంది. విశ్లేషకుల అంచనాలకి మించి వసూలు చేస్తోంది.

జూలై 12 భారతీయుడు 2 వచ్చాక కూడా మరీ చెప్పుకునే స్థాయిలో కల్కి డ్రాప్ ఉంటుందా లేదానేది దానికొచ్చే రెస్పాన్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పటికైతే ఎంత కమల్ హాసన్ సినిమా అయినా సరే ఆశించిన స్థాయిలో బజ్ లేదు. తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎల్లుండి నుంచి ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు. ఇది బాగుంది అంటే కల్కికి వెళ్లాలన్న రిపీట్ ఆడియన్స్ కొంత తగ్గుతారు. లేదూ కొంచెం టాక్ అటు ఇటు ఊగిందంటే మాత్రం ప్రభాస్ మళ్ళీ కమ్మేస్తాడు. నాలుగే రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ చేరుకుంటుందని చెప్పలేం కానీ దగ్గర్లోనే అందుకోవడం మాత్రం ఖాయం. 

This post was last modified on July 5, 2024 12:25 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago