జ‌గ‌న్ కు ఇది భారీ షాకే.. బాబు మామూలోడుకాదు!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ప్ర‌జ‌లు భారీ షాక్ ఇచ్చారు. దీని నుంచి ఆయ‌న ఇంకా కోలుకోలేదు. మ‌న‌శ్శాంతి కోసం సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు వెళ్లారు. అక్క‌డ కాంట్రాక్ట‌ర్లు బిల్లుల కోసం.. తిప్పలు పెట్టారు. ఇక‌, త‌ర్వాత‌.. బెంగ‌ళూరు వెళ్లారు. అక్క‌డ కూడా.. మ‌న‌సు స్థిరంగా లేదు. అయినా.. అక్క‌డే ఉండి తాజాగా 1వ తారీకు.. తాడేప‌ల్లికి వ‌చ్చారు. గ‌తంలో మాదిరిగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తాలు ద‌క్క‌లేదు. నాయ‌కులు క్యూలో నిల‌బ‌డి బొకేలు కూడా ఇవ్వ‌లేదు. ఇదొక షాక్‌.

మ‌రోవైపు.. ప్ర‌భుత్వం ప‌రంగా..సీఎం చంద్ర‌బాబు మ‌రో భారీ షాక్ ఇచ్చారు. అస‌లు ఇవ్వ‌రు.. పెంచేయడం అయితే.. పెంచేస్తారు. ఇంటికి కిలో బంగారం కూడా ఇస్తామ‌ని చెబుతార‌ని ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబుపై తీవ్ర ప్ర‌చారం చేసిన‌.. జ‌గ‌న్‌కు షాకిస్తూ.. 1వ తేదీ.. పెంచిన పింఛ‌నును.. బ‌కాయిల‌తో క‌లిపి ఏకంగా 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా.. ల‌బ్ధిదారుల‌కు చంద్ర‌బాబు పంపిణీ చేశారు. దీంతో జ‌గ‌న్ మాట‌ల డొల్ల‌త‌నాన్నిఆయ‌న ఎండ‌గ‌ట్టిన‌ట్ట‌యింది.

ఇదేస‌మయంలో కేవ‌లం వ‌లంటీర్లు మాత్ర‌మే చేయ‌గ‌ల‌ర్న ఈ కార్య‌క్ర‌మాన్ని స‌చివాల‌య సిబ్బందితో చేయించిన‌.. చంద్ర‌బాబు రాత్రి 10 గంట‌ల స‌మ‌యానికి 96 శాతం మందికి పింఛ‌న్లు పంపిణీ చేయ‌డం పూర్తి చేయించారు. ప్ర‌తి గంట‌కూ మానిట‌రింగ్ చేశారు. ఫ‌లితంగా.. పింఛ‌న్ల పంపిణీలో వ‌లంటీర్లు లేక‌పో యినా.. ఇంటింటికీ తిరిగి ఇవ్వొచ్చ‌ని చంద్ర‌బాబు నిరూపించారు. ఇది మ‌రింత షాక్‌. నిజానికి చంద్ర‌బాబు స‌ర్కారు ఏర్ప‌డి 18 రోజులు అయింది. ఫ‌లితాలు వ‌చ్చి 26 రోజులు అయింది.

ఇంత‌లోనే.. 4 వేల కోట్ల‌ను పింఛ‌న్ల రూపంలో పంపిణీ చేయ‌డం అంటే.. తొలి విజ‌యం చంద్ర‌బాబు ద‌క్కించుకున్న‌ట్టు అయింది. అంతేకాదు.. ఊరూవాడా కూడా.. ఆయ‌నకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ ప‌రిణామం.. వైసీపీకి మ‌రింత ఇబ్బందిగా మారింది. సంక్షేమం అంటే.. త‌మ‌వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని.. త‌మ‌కే పేటెంట్ ఉంద‌ని.. చెప్పుకొన్న జ‌గ‌న్‌కు.. ఇప్పుడు నోట మాట‌రాకుండా.. మాట్లాడేందుకు ఏమీ లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఫ‌స్ట్ స్టెప్‌లోనే జ‌గ‌న్ కు బాబు భారీ షాక్ ఇచ్చార‌ని అంటున్నారు.