బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత జైలు పాలై 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఆమె దాదాపు 22 సార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నారు. కారణాలు అనేకం చెప్పారు.వీటిలో పిల్లాడి చదువు ఉందన్నారు. ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. తనకు అనారోగ్యం అన్నారు. ఇంకా ఏవేవో చెప్పారు. గత సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉదహరించారు. కానీ, ఎక్కడా కోర్టులు కరుణించలేదు.
ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో మాత్రం ఒక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ లో ఉంది. కానీ, ఇంతలోనే సీబీఐ, ఈడీలో మరో రెండు పిటిషన్లు రెడీ చేసుకున్నాయి. రౌస్ ఎవెన్యూ కోర్టు కనుక.. కవితకు అనుకూలంగా బెయిల్ మంజూరు చేస్తే.. వెంటనే రద్దు చేయించేందుకు ఈ బృందాలు రెడీ అయ్యాయి. దీంతో బెయిల్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. ధ్యానం..పుస్తక పఠనం.. తోటి ఖైదీలకు రాజకీయ పాఠాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
మధ్య మధ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి కలుస్తున్నారు. విరామ సమయాల్లో కోర్టుకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ జై తెలంగాణ నినాదంతో పాటు.. అక్రమ కేసులు పెట్టారన్న నినాదాలు వినిపిస్తున్నారు. అయితే.. ఈ కేసు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి. కాగా, ఈ ఏడాది మార్చి 15న సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని నివాసం నుంచి అరెస్టు చేసి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కేసులో రూ.100 కోట్లను సౌత్ గ్రూప్‌కు చేరవేయడంలో కీలక రోల్ కవితేనని సీబీఐ, ఈడీలుఆరోపిస్తున్నాయి. ఫోన్లను ధ్వంసం చేశారని.. సాక్ష్యాలను రద్దు చేయడంలో ఖతర్నాక్‌గా వ్యవహరించారని తీవ్ర వ్యాఖ్యలతోనే కోర్టుకు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. మొత్తానికి కవిత జైలు పాలై.. 100 రోజులు కావడం గమనార్హం.
This post was last modified on June 24, 2024 5:31 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…