తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇలాంటి కష్టకాలం వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించి ఉండరు. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన షాక్‌తో కుంగిపోయిన కేసీఆర్‌ను.. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా ఫలితం మరింత దెబ్బకొట్టింది. దీంతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడటంతో నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్‌ను కాపాడేది హరీష్ రావు మాత్రమేనన్న అభిప్రాయాలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనే డిమాండ్లూ వస్తున్నాయి. కానీ ఆ అవకాశం ఇస్తారా? అన్నదే ప్రశ్న.
ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ కేసీఆర్ ఫాం హౌజ్ దాటి బయటకు రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లో పదును లేదు. దీంతో పార్టీ శ్రేణులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ లీడర్ ఎప్పుడు పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. పార్టీ నాయకులు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి,ఈ జంపింగ్‌లను ఆపే దిశగా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. క్లాస్ లీడర్‌గా పేరున్న కేటీఆర్ పార్టీని కాపాడలేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పార్టీ అధినేత కేసీఆర్ ఎలాగో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే అధ్యక్షుడిగా హరీష్ రావును నియమిస్తే పార్టీ తిరిగి పుంజుకునే అవకాశముంటుంది. మాస్ లీడర్‌గా పేరొందిన హరీష్ పార్టీలో మళ్లీ జోష్ నింపే ఆస్కారముంటుంది. కానీ హరీష్‌కు కేసీఆర్ ఆ బాధ్యతలు ఇవ్వడం అనుమానంగానే మారింది. పేరుకు మేనళ్లుడే అయినా హరీష్‌ను నమ్మే విషయంలో కేసీఆర్ కాస్త సందేహిస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. గతంలో హరీష్ బీజేపీలో చేరతారనే ప్రచారంతో ఆయన్ని అప్పట్లో కేసీఆర్ దూరం పెట్టారని అంటారు. కానీ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే హరీష్‌కు పగ్గాలు అప్పగిస్తే బీఆర్ఎస్‌ను బతికించుకోవచ్చని సొంత నాయకులే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 24, 2024 9:54 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…