గుంటూరు జిల్లా శివారులోని తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ.. శనివారం ఉదయం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. 7 బుల్డోజర్లను వినియోగించి, పటిష్టమైన భద్రత మధ్య ఈ భవనాలను కూల్చేశారు.
అయితే.. దీనిపై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని.. రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమన కాండను ఈ స్థాయికి తీసుకెళ్లారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని అన్నారు.
అయితే.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విధ్వంసం అంటే.. ఇది కాదు..జగన్ రెడ్డీ!
అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన కొన్ని ఘటనలను వారు ఉదహరిస్తూ.. ఇవీ విధ్వంసాలంటే!
అని చెబుతున్నారు. అవి ఏంటంటే!
ప్రజావేదిక కూల్చివేత: గతంలో చంద్రబాబు పాలన సమయంలో 8 కోట్ల రూపాయలు వ్యయం చేసి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజావేదిక.. అనేక రూపాల్లో వినియోగించుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ప్రజల సమస్యలు వినేందుకు.. ప్రజాప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు దీనిని నిర్మించారని తెలిపారు.కానీ, 2019లో అధికారంలో కి వచ్చిన జగన్.. దీనిని కూల్చి వేశారని.. కనీసం దీనిపై చర్చించకుండానే.. ఒక్క మాటతో దీనిని కూల్చి వేశారని.. ఇదీ విధ్వంసం అంటే అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటంలో కూల్చివేతలు: మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడి రైతులు కొందరు.. ఆయనకు స్థలం ఇచ్చారు. దానిలోనే పవన్ కల్యాణ్ పార్టీ సమావేశం నిర్వహించుకున్నారు. దీనిపై కక్ష కట్టినట్టుగా వైసీపీ ప్రబుత్వం అప్పట్లో పవన్ కల్యాణ్ సభకు పొలాలను ఇచ్చిన వారి ఇళ్లను కూలగొట్టిందనే ఆరోపణలు వినిపించాయి. దీనిని ప్రస్తావిస్తూ.. విధ్వంసం అంటే ఇదీ జగన్ రెడ్డీ
అని వ్యాఖ్యానిస్తున్నారు.
పోలవరం నిధుల మళ్లింపు: ఏపీ ప్రజల జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు.. కేంద్ర ప్రబుత్వం 6 వేల కోట్లను ఇచ్చింది. దీనిని వివిధ సంక్షేమ పథకాలకు మళ్లించి.. ఆ నిధులను రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేయని విధానమే విధ్వంసం అని.. ఇన్ని విధ్వంసాలను పక్కన పెట్టి.. ఇప్పుడు జరిగిన చిన్న ఘటనపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటూ జగన్‌పై వారంతా మండిపడుతున్నారు. గత ఐదేళ్లలో రుషికొండ వంటి ప్రకృతి వనరును నిర్లజ్జగా..తొవ్వేసి పర్యావరణానికి హానీ కలిగిస్తూ.. చేసిన భవంతి నిర్మాణం విధ్వంసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత దాడులు, దూషణలతో రెచ్చిపోయి పాలన చేయడం విధ్వంసం కాదా? అని నిలదీస్తున్నారు. ఇన్ని విధ్వంసాలకు కారణమైన.. జగన్.. ఇప్పుడు విధ్వంసం.. విధ్వంసం అంటూ.. గగ్గోలు పెట్టడం.. మీకు సూటవదు సర్!! అని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
కొసమెరుపు : నిన్న కూల్చిన వైసీపీ పార్టీ కార్యాలయం 16వ జాతీయ రహదారిని అమరావతి రోడ్డుతో అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్లాన్ ను అడ్డుకునేలా రోడ్డు వేసే మార్గంలో కట్టినందు వల్లే కూల్చడానికి ఉన్న కారణాల్లో ఒక కారణమని ప్రభుత్వం పేర్కొంది.
This post was last modified on June 23, 2024 12:12 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…