వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అన్నట్టుగానే చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టా రు. ఆయనతోపాటు.. 10 మంది సభ్యులను కూడా రాకుండా చేశారు. శుక్రవారమే పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్.. సభకు వెళ్లే విషయంపై తన పార్టీ నేతలతో ఆయన చర్చించారు.
‘మీ ఇష్టం’- అని జగన్ చెప్పినా.. అంతర్లీనంగా.. తాను వెళ్లడం లేదని చెప్పేశారు. దీంతో ఇతర సబ్యులు కూడా.. శనివారం సభకు డుమ్మా కొట్టారు. మరి ఇది ఏమేరకు ఆదర్శమో చూడాలి.
ప్రజా తీర్పును గౌరవిస్తామని.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తామని.. జగన్ ఎన్నికలు ఫలితం వచ్చిన తర్వాత.. చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే ప్రజాతీర్పును తుంగలోకి తొక్కారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం శనివారం సభలో స్పీకర్‌ను ఎన్నుకున్నారు.
ఏకగ్రీవంగా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం.. అధికార పక్షం సహా ఇతర పార్టీల సభ్యులు ఆయనను సీటు వరకు తోడ్కొని వెళ్లి.. సీటులో కూర్చోబెట్టాలి.
ఈ విషయంలో జగన్ సంప్రదాయాన్ని వదిలేశారు. వాస్తవానికి ఆయన సభకు రాకపోయినా.. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయినా.. సభకు పంపించి.. సంప్రదాయాన్ని కాపాడుతారని అందరూ అనుకున్నారు. తాడేపల్లి వర్గాలు కూడా.. ఇదే చెప్పాయి.
కానీ, చివరకు వైసీపీ నాయకులు రెండోరోజు సభకు ఎవరూ రాకపోవడం గమనార్హం. దీంతో సభా నాయకుడిగా చంద్రబాబు, డిప్యూటీసీఎంగా, జనసేన అధినేతగా పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున మంత్రి సత్యకుమార్ యాదవ్‌లే .. అయ్యన్నను తోడ్కొని వెళ్లారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ తాను చెప్పినట్టే చేశారు.కానీ, సంప్రదాయాలను మాత్రం విస్మరించార నే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి.
2019లో టీడీపీకి 23 సీట్లు దక్కిన ప్పుడు.. స్పీకర్ తమ్మినేని సీతారాంను.. సీటు వరకు.. తోడ్కొని వెళ్లడంలో చంద్రబాబు ఉదాశీనంగా వ్యవహరించారని యాగీ చేశారు. కానీ.. ఇప్పుడు జగన్ కూడా ఇదే పనిచేశారు. దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates