డ‌బ్బులొద్దులే.. సామాన్లు ఇచ్చేయండి జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో త‌న ఇంటినే కార్యాల‌యంగా మార్చుకుని అక్క‌డి నుంచే అప్పటిసీఎం జ‌గ‌న్‌పాల‌న చేసిన విష‌యం తెలిసిందే. దీంతో అధికారికంగా.. ఆయ‌న కార్యాల‌యంలో ఫ‌ర్నిచ‌ర్‌.. ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించారు. అయితే.. తాజాగా వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూల‌డంతో ప్ర‌భుత్వ ధ‌నంతో కొనుగోలు చేసిన ఫ‌ర్నిచ‌ర్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజ‌కీయ దుమారం కూడా రేగింది.

గ‌తంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఇలానే ఫ‌ర్నిచ‌ర్ త‌న ఇంట్లో ఉంచుకుంటే.. ఆయ‌న‌పై దొంగ అని ము ద్ర వేశార‌ని, ఇప్పుడు జ‌గ‌న్ కూడా అలాంటి ప‌నే చేశారు కాబట్టి.. ఆయ‌న‌పైనా దొంగ‌త‌నం కేసు పెట్టాలం టూ.. కొంద‌రు టీడీపీ నాయ‌కులు.. స‌హా కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది. లెక్క‌క‌ట్టండి సొమ్ములు చెల్లిస్తాం అంటూ.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చంద్ర‌బాబు స‌ర్కారుకు లేఖ‌రాశారు.

అయితే..దీనిపై సుదీర్ఘ మంత‌నాలు చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాజాగా జ‌గ‌న్ కార్యాల‌యానికి లేఖ రాసింది. డ‌బ్బులు వ‌ద్దులే.. సామాన్లు తిరిగి ఇచ్చేయండి అని పేర్కొంది. దీంతో జ‌గ‌న్ కార్యాల‌యం ఇప్పుడు ఫ‌ర్నిచ‌ర్‌ను ప్ర‌భుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ ఫ‌ర్నిచ‌ర్‌కొంత డ్యామేజీ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో డ్యామేజీ అయిన ఫ‌ర్నిచ‌ర్ వ‌ర‌కు లెక్క క‌ట్టి సొమ్ము చెల్లిస్తారా? లేక‌.. ఏం చేస్తార‌నేది చూడాలి.ఏదేమైనా.. ఫ‌ర్నిచ‌ర్‌వివాదానికి చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో చెక్ పెట్టారు.