ఏపీలో చంద్రబాబుకు ఎపుడూ లేనంత క్రేజ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే.. ఇప్పుడు అంద‌రికీ ఆరాధ్యుడిగా మారిపోయారు. గ‌త 2014-19 మ‌ధ్య ఆయ‌న పాల‌న చేశారు. ఆయ‌న పాల‌న ఉమ్మ‌డి ఏపీకి, విభ‌జిత ఏపీకి కూడా కొత్త‌కాదు. కానీ, ఇప్పుడు మాత్రమే చంద్ర‌బాబు కు ఎన‌లేని.. గుర్తింపు.. ప్ర‌జ‌ల్లోనూ ఆరాధ్య భావం రెట్టింపు అయ్యాయి. సాధార‌ణం గా చంద్ర‌బాబుపై సానుభూతి ఉండ‌డం వేరు.. కానీ, ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబు అంటే.. ఒక ర‌క‌మైన పిచ్చి ఏర్ప‌డింది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి?

1) త‌న‌ను తాను త‌గ్గించుకోవ‌డం: సీనియార్టీ ప‌రంగా చూస్తే.. ఉమ్మ‌డి ఏపీ నుంచి విభ‌జిత ఏపీ వ‌ర‌కు.. ముఖ్య‌మంత్రి అయిన వారిలో ఎన్టీఆర్ త‌ర్వాత‌.. చంద్ర‌బాబే సీనియ‌ర్‌గా ఉన్నారు. ఈ భావ‌న‌తోనే గ‌తంలో ఆయ‌న కొంత డిస్టెన్స్ పాటించారు. కానీ, ఇప్పుడు ఆ హ‌ద్దులు చెరిపి వేశారు. అంద‌రికీ చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌ను తాను త‌గ్గించుకుని.,. తాను ఎక్కువ కాద‌నే సందేశాన్ని పంపిస్తున్నారు. కూట‌మి పార్టీల‌తో క‌లివిడిగా ఉంటున్నారు.

2) ఫీల్ గుడ్: చంద్ర‌బాబు హ‌యాంలో వ్యాపారాలు.. సంస్థల ఏర్పాటు విష‌యంలో ఫీల్ గుడ్ అనే భావ‌న పెరుగుతుంది. ఇది గ‌తంలోనూ ఉంది. అయితే.. అప్ప‌టికి ఇప్ప‌టికి మ‌రింత మార్పు అయితే.. క‌నిపిస్తోంది. దీంతో చంద్ర‌బాబు పాల‌న విష‌యంలో వ్యాపార వేత్త‌లు.. మ‌రింత ముందుకు వ‌స్తున్నారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ కార‌ణంగానే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

3) పోలీసింగ్‌: రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డంలో చంద్ర‌బాబు ముందున్నారు. గ‌తంలో ఫ్యాక్ష‌న్ జిల్లాలుగా పేరున్న క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌న ఫ్యాక్ష‌న్‌ను అణిచేశారు. ఎక్క‌డా ఎవ‌రిపైనా రాజ‌కీయ ప్రతీకారేచ్ఛ‌తో ర‌గిలిపోయిన సంద‌ర్భాలు కూడా లేవు. ఇది ఇప్పుడు కూడా కొన‌సాగిస్తున్నారు. ముందుగానే ఆయ‌న పోలీసును ఈ విష‌యంలో హెచ్చ‌రించారు. ఇది కూడా.. సాధార‌ణ ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబును హైలెట్ చేస్తోంది. దీంతో బాబు పాల‌న‌పై పిచ్చి పెరిగిపోయింద‌ని వాద‌న వినిపిస్తోంది.