సీఎంల శాలరీలు – రేవంత్, చంద్రబాబు స్థానాలు ఏంటి?

ఏపీకి నాలుగోసారి(రెండు సార్లు ఉమ్మ‌డి ఏపీ-రెండు సార్లు విభ‌జిత ఏపీ) ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా పేరున్న చంద్ర‌బాబు పొదుపు విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప‌నిలో ముందున్న ఆయ‌న వేత‌నంలో మాత్రం వెనుక‌బ‌డ్డారు. అసలు చంద్ర‌బాబు ఎంత జీతం తీసుకుంటారు? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. ఉత్త‌ర ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర, ఢిల్లీ ముఖ్య‌మంత్రులు వేత‌నాల్లో ముందుండగా.. వారి త‌ర్వాత‌.. చంద్ర‌బాబు నిలిచారు.

దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా సీఎంల వేతనం ఉంటుంది. వారి రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధారపడివుంటుంది. సీఎంగా చంద్రబాబుకు ప్రభుత్వం ఇంటిని ఇస్తుంది. వాహనంతోపాటు భద్రతా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే దేశ విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సొంత విమానాలను, హెలికాప్టర్లను కలిగివున్నాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.

ఆ రాష్ట్ర గవర్నర్ తోపాటు ముఖ్యమంత్రి కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సమయం ఆదా చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతుంటారు. రాష్ట్రంలో పయనించేందుకు హెలికాప్టర్, రాష్ట్రం బయటకు విమానాన్ని వాడతారు. ఇక‌, వేత‌నం విష‌యానికి వ‌స్తే.. చంద్రబాబుకు వేతనాన్ని 3,35,000గా నిర్ణయించారు. అదనంగా ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇక‌, ఇటీవ‌ల‌ ప్రమాణ స్వీకారం చేసిన ఒడిసా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీకి 1.60 లక్షలను వేత‌నంగా నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.

అతి తక్కువగా దేశంలో త్రిపుర ముఖ్యమంత్రి వేతనం ఉంది. ఆయనకు 1.05 లక్షలు తీసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం అత్యధిక వేతనం ఉంది. ఆయన 4.10, 000 తీసుకుంటున్నారు. దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత వేతనం తీసుకుంటున్నారో తెలుసుకుందాం.

తెలంగాణ – 4,10,000, ఆంధ్రప్రదేశ్ – 3,35,000,గుజరాత్ – 3,21,000, హిమాచల్ ప్రదేశ్ – 3,10,000, హరియాణా – 2,88,000, జార్ఖండ్ – 2,55,000, ఢిల్లీ – 3,90,000, ఉత్తరప్రదేశ్ – 3,65,000, మహారాష్ట్ర – 3,40,000, పశ్చిమ బెంగాల్ – 2,10,000, ఉత్తరాఖండ్ – 1,75,000, రాజస్థాన్ – 1,75,000, ఒడిశా – 1,60,000, మేఘాలయ – 1,50,000, అరుణాచల్ ప్రదేశ్ – 1,33,000, అస్సాం – 1,25,000, తమిళనాడు – 2,05,000, కర్ణాటక – 2,00,000, సిక్కిం – 1,90,000, కేరళ – 1,85,000, మణిపూర్‌ – 1,20,000, నాగాలాండ్‌ – 1,10,000, త్రిపుర – 1,05,500, మధ్యప్రదేశ్ – 2,30,000, ఛత్తీస్‌గడ్ – 2,30,000, పంజాబ్ – 2,30,000, గోవా – 2,20,000, బీహార్ – 2,15,000.