సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో లేదో కానీ తన ఇతర కమిట్ మెంట్ల మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నాడు. త్రివిక్రమ్ తో హారికా హాసిని బ్యానర్ మీద రూపొందే ప్యాన్ ఇండియా మూవీకి అతి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. నిర్మాత నాగవంశీ దీని గురించి ఇస్తున్న ఎలివేషన్లు వింటుంటే షూటింగ్ మొదలుకాకముందే అంచనాలు పీక్స్ కు వెళ్లిపోతున్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమవుతుందో పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ ముంబై వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే త్రివిక్రమ్ సినిమా అయ్యాక ఆయనతో చేతులు కలిపే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం భన్సాలీ లవ్ అండ్ వార్ రూపొందిస్తున్నారు. రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. విజువల్ గ్రాండియర్స్ ని కవితాత్మకంగా తెరకెక్కిస్తారని పేరున్న భన్సాలీ ఈ సారి పీరియాడిక్ డ్రామాని ఎంచుకున్నట్టు తెలిసింది. లవ్ అండ్ వార్ 2025 డిసెంబర్ రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ బాలీవుడ్ వర్గాలు అప్పటికి రావడం అనుమానమే అంటున్నాయి.
వీటిని పక్కనపెడితే అల్లు అర్జున్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబో ఒకటి పెండింగ్ లో ఉంది. టి సిరీస్ ఎప్పుడో ప్రకటించింది కానీ మిగిలిన వివరాలు చెప్పలేదు. స్పిరిట్ వచ్చేలోపు రెండేళ్లు పట్టేలా ఉంది కాబట్టి ఆలోగా త్రివిక్రమ్, భన్సాలీల సినిమాలు బన్నీ పూర్తి చేసుకోవచ్చు. అయితే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఇదంతా ఊహాగానంగానే చెప్పుకోవాలి. అదే పనిగా అంత దూరం వెళ్లడమంటే మాటలు కాదుగా. ఇవన్నీ సరే కాని పుష్ప 3 ర్యాంపేజ్ కోసం డిమాండ్ మాములుగా లేదు. మరి రామ్ చరణ్ 17 చేయబోయే సుకుమార్ ఏం చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే. చాలా టైం అయితే పట్టేలా ఉంది.