విశాఖపట్నం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నగరం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిపాలన రాజధానిగా విశాఖను చేసుకుని రుషికొండ ప్యాలెస్ నుంచి పాలన నిర్వహిద్దామనుకున్నారు. కానీ బ్యాడ్‌లక్. ప్రజలు ఓట్లతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. రాజకీయ, ఐటీ, పారిశ్రామిక రంగాల పరంగా కీలకమైన విశాఖపై ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసింది. పొలిటికల్‌గా ఇక్కడ మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టిన ఆయన వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని సమాచారం. అందుకు లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఇప్పుడు పెద్ద నగరంగా ఉన్న విశాఖను కేంద్రంగా చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. అందుకే విశాఖ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా నారా లోకేశ్‌కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశముందని అంటున్నారు. జిల్లా ఇంఛార్జీ మంత్రి నాయకత్వంలోనే విశాఖలో పాలన జరిగే అవకాశముంది. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేశ్ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ పరంగా అభివృద్ధి చేయాలన్నా లోకేశ్‌కు ఇక్కడ పట్టు ఉండటం అవసరం.
అలాగే విశాఖను పారిశ్రామికంగానూ మరింత డెవలప్ చేయాలనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇక్కడ వైసీపీ అడ్రస్ లేకుండా చేసి, టీడీపీని మరింత బలోపేతం చేయాలన్నది బాబు లక్ష్యం. అందుకే అన్ని విధాలుగా విశాఖపై పట్టు సాధించేందుకు లోకేశ్‌కు బాబు బాధ్యతలు అప్పజెప్పే అవకాశముందని తెలిసింది. లోకేశ్ ద్వారా విశాఖపై బాబు నేరుగా మానిటరింగ్ చేసే ఆస్కారముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates