రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్‌కు మరిన్ని బాధ్యతలు పెంచారు సీఎం చంద్ర బాబు. రాష్ట్ర విద్యాశాఖ మొత్తాన్నీ ఆయన చేతిలోనే ఉంచారు. అదేవిధంగా కీలకమైన ఐటీ శాఖను కూడా నారా లోకేష్‌కు అప్పగించారు. గతంలోనూ నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. కానీ, అప్పట్లో ఐటీ శాఖను మాత్రమే ఆయనకు బాబు పరిమితం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్‌కు బాధ్యతలు పెంచా రు. ప్రస్తుతం వేసిన మెగా డీఎస్సీ తదుపరి బాధ్యత కూడా ఇప్పుడు లోకేష్‌పైనే ఉండనుంది.
ప్రస్తుతం జరిగిన కేటాయింపును చూస్తే.. నారా లోకేష్‌కు మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఐటీ, ఎలక్ట్రాని క్స్, కమ్యేనికేషన్, ఆర్టీజీ శాఖలను అప్పగించారు. విద్యాశాఖలో ఉన్న మూడు విభాగాలను కూడా మానవ వనరుల విభాగంలో కలిపేశారు. దీంతో పాఠశాల నుంచి ఉన్నత విద్యాశాఖ వరకు నారా లోకేష్ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కీలకమైన ఐటీ శాఖ ద్వారా ఆయన ఐటీ పెట్టుబడులను కూడా తీసుకురావాల్సి ఉంటుంది. వీటితో పాటు.. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఈయనపైనే పడనుంది.
ఇక, కర్నూలు ఎమ్మెల్యే, యువ మంత్రి టీజీ భరత్ కు కూడా అత్యంత ప్రాధాన్యం ఉన్న శాఖలను చంద్ర బాబు అప్పగించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖలను అప్పగించారు. ఈ మూడు కూడా.. రాష్ట్రానికి ఆదాయం, పెట్టుబడులు తెచ్చేవే కావడం గమనార్హం. పరిశ్రమల ద్వారా.. పెట్టుబ డులు.. వాణిజ్యం ద్వారా.. పన్నులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను పెంచడం ద్వారా పర్యాటకానికి ఈ శాఖ ప్రోత్సాహకరంగా.. పైగా ఆదాయం పరంగా కూడా.. ఉండనుంది. దీంతో ఈ శాఖలను వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన భరత్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది.
విద్యుత్‌కు గొట్టిపాటి
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే, కమ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు విద్యుత్ శాఖను అప్పగించారు. ఇక, రహదారుల, భవనాల శాఖలను బనగాన పల్లి ఎమ్మెల్యే కమ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. కార్మిక, ఫ్యాక్టరీ శాఖలను వాసం శెట్టి సుభాష్‌కు అప్పగించారు. కీలకమైన జలవనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. పోలవరం బాధ్యతలను ఈయనే చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా నదుల అనుసంధానం కూడా. ఈయనకు ప్రాధాన్యం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates