Political News

చిన్న నిర్ణ‌యం..చంద్ర‌బాబు క్రెడిట్ కొట్టేశారుగా!

అధికారంలోకి రావ‌డం ఎంత క‌ష్ట‌మో.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు ఉత్త‌మ పేరు తెచ్చుకోవ‌డం అంతకు నాలుగింత‌లు క‌ష్టం. అందునా.. ప్ర‌జ‌ల్లో ఆదిలోనే పేరు తెచ్చుకోవ‌డం అంటే మాట‌లు కాదు. కానీ.. ఈ క్రెడిట్‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొట్టేశారు. క‌క్ష పూరిత రాజ‌కీయాలు.. నిర్ణ‌యాల‌కు ఆయ‌న చెక్ పెట్టారు. పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న ఏం చెప్పారో.. ఇప్పుడు ఆయ‌న ఆచ‌ర‌ణ‌లోనూ చేసి చూపిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్న కూడా చంద్ర‌బాబు ఫాలో అవుతున్నారు. వాటిని ఆపొద్దు.. అంటూ ఆయ‌న తాజాగా ఆదేశించారు. దీంతో చంద్ర‌బాబు ఔన్న‌త్యం.. ఆయ‌న పాల‌న‌కు ఈ ఆదేశాలు మ‌చ్చుతున‌క‌గా మారాయని పార్టీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏం జ‌రిగింది?

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే చిన్నారులకు ‘జ‌గ‌నన్న విద్యా కానుక‌’ కింద యూనిఫాంలు, షూస్‌, పుస్త‌కాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను ఉచితంగానే అందించేది. అయితే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ తామే అధికారంలోకి వ‌చ్చేస్తామ‌న్న దీమాతో ముందుగానే.. ఆయా వ‌స్తువుల‌ను కొనిపెట్టుకున్నారు. దాదాపు 9 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు వీటిని పంపిణీ చేయాల్సి వుంది. అయితే.. వీటిపై ప‌థ‌కం పేరు ‘జ‌గ‌న‌న్న విద్యాదీవెన’ అలానే ఉంది. దీంతో స‌హ‌జంగానే కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం వాటిని ముర‌గ‌బెట్టేసే అవ‌కాశం ఉంది. ఎందుకంటే..గ‌త ముఖ్య‌మంత్రి పేరును ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అంగీక‌రించ‌దు. కానీ, తాజాగా చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ప్రభుత్వం మారడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు,యూనిఫామ్ తో కూడిన కిట్స్ సంగతేంటనే ప్రశ్న తలెత్తింది. అయితే వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ప్ర‌బుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 9 ల‌క్ష‌ల మందికీ.. వీటిని పంపిణీ చేయ‌నున్నారు. అయితే.. ఇక్క‌డ చిన్న క్లాజు పెట్టారు. గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది స‌హ‌జంగానే ఏ ప్ర‌భుత్వ‌మైనా చేస్తుంది.

జ‌గ‌న్ అయితే..

ఇక‌, జ‌గ‌న్ పాల‌నా విష‌యానికి వ‌స్తే.. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు సీఎంగా ఉన్న కాలంలో చేప‌ట్టిన ప్ర‌తికార్య‌క్ర‌మాన్నీ నిలిపి వేశారు. రాష్ట్రానికే త‌ల‌మానిక‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని ఆపేశారు. కీల‌కమైన స‌మావేశాలు, కార్య‌క్ర‌మాలు చేసుకునేలా 8 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన‌ ప్ర‌జావేదిక కూల్చేశారు. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టిన‌ అన్నాక్యాంటీన్ల‌ను నిలిపి వేశారు. అంతేకాదు.. పేద‌ల‌కు ఉద్దేశించి గూడు క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో నిర్మించిన టిడ్కో ఇళ్ల‌ను పేద‌లు ఎంత ప్రాధేయ ప‌డ్డావాటిని పంపిణీ చేయ కుండా నిలిపివేశారు. అంతేకాదు.. చివ‌ర‌కు దివ్యాంగుల‌కు పంపిణీ చేయాల‌ని కొనుగోలు చేసిన‌.. త్రిచ‌క్ర‌వాహ‌నాల‌ను కూడా చెత్త‌బుట్ట దాఖ‌లు చేశారు త‌ప్ప‌.. క‌నీసం వాటిని పంపిణీ చేద్దామ‌న్న కీల‌క నేత‌ల మాట‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోలేదు.

This post was last modified on June 11, 2024 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

2 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

5 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

6 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

6 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago