Political News

అక్షయ్‌పై నెగెటివ్ కామెంట్.. హరీష్‌ శంకర్‌కు మండిపోయింది

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లో హరీష్ శంకర్ ఒకడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి హరీష్ అస్సలు మొహమాట పడడు. ఈ మధ్య బాలీవుడ్ సోకాల్డ్ ‘లిబరల్స్’ మీద హరీష్ ఎలా పంచులు వేశాడో తెలిసిందే.

మైనారిటీలకు వ్యతిరేకంగా ఏం జరిగినా గళం విప్పే ఈ సూడో సెక్యూలరిస్టులు.. ఇటీవల మహారాష్ట్రలో సాధువుల్ని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు మాట్లాడలేదంటూ హరీష్ శంకర్ నిలదీశాడు. అనురాగ్ కశ్యప్ సహా కొందరు లిబరల్స్ ఇప్పుడేమయ్యారంటూ వాళ్ల ఫొటోలు పెట్టి మరీ కౌంటర్లు వేశాడు. తాజాగా ‘ది ప్రింట్’ ఇంటర్నెట్ ఎడిషన్లో రాసిన ఓ వ్యాసం మీద హరీష్ శంకర్ మండిపడ్డాడు. అందులో అక్షయ్ కుమార్ గురించి చేసిన కామెంట్ హరీష్‌కు ఆగ్రహం తెప్పించింది.

బీజేపీ వాళ్లు భారతీయ పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీని ఇంకా ఇటాలియన్‌గానే చూస్తారని.. కానీ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్ కుమార్‌ను మాత్రం ఇండియన్‌గా గౌరవిస్తారని ఆ కథనంలో వ్యాఖ్యానించారు. దీనిపై హరీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇందులో అక్షయ్ గురించి వ్యాఖ్యలు చేశారని.. అక్షయ్ నిజంగా కెనడా వాసే అయినా తమకు అభ్యంతరం లేదని.. అతను ఈ దేశాన్ని ఏలాలని చూడట్లేదని.. కేవలం వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నాడని.. సంక్షోభాలు తలెత్తిన అనేక సందర్భాల్లో అక్షయ్ కోట్ల రూపాయలు సాయం చేశాడని.. మరి సదరు ‘మేడమ్’ ఏం చేసిందని హరీష్ ప్రశ్నించాడు.

ఇలాంటి పోలిక తీసుకురావడం సిగ్గు చేటని.. బీజేపీ మీద నిందలేయాలనుకుంటే వేయొచ్చని.. కానీ సినిమా వాళ్లను టచ్ చేసే సాహసం చేయొద్దని, తాము జనంతో ఉన్నామని అన్నాడు హరీష్. ఆయన ట్వీట్లకు జాతీయ స్థాయిలో నెటిజన్ల నుంచి గట్టి మద్దతే లభించింది.

This post was last modified on April 27, 2020 5:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మేము పుష్ప 2 కోసం పని చెయ్యలేదు, ప్రాణాలు పెట్టేసాం: బన్నీ!

ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…

4 hours ago

మీ హీరో ఇంకో మూడేళ్లు ఇస్తే పార్ట్ 3 తీస్తా : సుకుమార్!

పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…

5 hours ago

మగధీర తర్వాత పుష్ప 2నే – అల్లు అరవింద్!

హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…

5 hours ago

తెల్ల చీరలో హంస వలె కవ్విస్తున్న కిస్సిక్ పాప..

కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…

5 hours ago

ఏపీ టికెట్ రేట్లు వచ్చేశాయి… పవన్ కి థాంక్స్ చెప్పిన బన్నీ!

తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…

6 hours ago

పుష్ప కి ప్రమోషన్ అక్కర్లేదు : రాజమౌళి ఎలివేషన్!

కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…

6 hours ago