Political News

టీటీడీ చైర్మ‌న్ రేసులో ఆ న‌లుగురు..!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ఎప్ప‌డూ హాట్ కేక్‌నే త‌ల‌పిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఆ పార్టీ త‌రఫున ఇక్క‌డ నామినేట్ అవుతారు.

ఈ సీటు కోసం.. కోట్ల రూపాయ‌లు ఇచ్చేందుకు కూడా.. చాలా మంది ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూట‌మి పార్టీల్లోనే.. ఈ ప‌ద‌వి కోసం.. పోటీ ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. టీటీడీ చైర్మ‌న్ రేసులో టీడీపీ నాయ‌కుడు.. పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్‌వీఎస్ ఎన్ వ‌ర్మ పేరు జోరుగా వినిపిస్తోంది.

ఎన్నిక‌ల‌వేళ‌.. త‌న సీటును త్యాగం చేయ‌డంతోపాటు.. చంద్ర‌బాబు కోరిక మేర‌కు వర్మ వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఆయ‌న‌కు మంత్రివ‌ర్గంలో సీటు ఇవ్వాల‌ని ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు అది సాధ్యం కాదు. మండలిలో సీట్లు ఖాళీ అయ్యేవ‌ర‌కు ఎదురు చూడాల్సి ఉంది.

దీంతో ఈలోగా.. వ‌ర్మ‌.. టీటీడ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ని ఇవ్వాల‌ని కోర‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే.. ఆయ‌న ప‌వ‌న్‌కు కూడా చెప్పిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో ఆయ‌న‌కు దాదాపు ఈ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఇక‌, జ‌న‌సేన‌లోనే మరో కీల‌క నాయ‌కుడు, ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు… పేరు కూడా వినిపిస్తోంది. కానీ,.. ఆయ‌న వ్య‌క్తిగ‌త స్వభావానికీ.. టీటీడీ పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వికి లింకు కుద‌ర‌డం చాలా క‌ష్టం.

దీంతో ఆయ‌న దాదాపు ఈ ప‌ద‌వికి దూరంగానే ఉంటార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీలోనూ ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఈ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీరిలో ఒక‌రు సోము వీర్రాజు. ఈయ‌న పార్టీ హైక‌మాండ్‌కు ఇప్ప‌టికే అర్జీ పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, మ‌రోనేత‌.. తిరుప‌తికి చెందిన భానుప్ర‌కాశ్ రెడ్డి. ఈయ‌న తాజా ఎన్నిక‌ల్లో తిరుప‌తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ, బీజేపీ ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. పైగా.. దీనిని జ‌న‌సేన‌కు వ‌దిలేశారు. దీంతో ఇప్పుడు టీటీడీ ప‌ద‌వి రేసులో ఆయ‌న జోరుగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మ‌రోవైపు.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి భ‌ర్త‌.. మాజీమంత్రి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా.. స్వామి సేవ‌లో త‌రించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే..ఈయ‌న పెద్ద‌గా పోటీ ఇవ్వ‌డం లేదు. మొత్తంగా చూస్తే.. టీటీడీ ప‌ద‌వి కోసం.. జోరుగానే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

This post was last modified on June 10, 2024 7:19 am

Share
Show comments
Published by
Satya
Tags: TTD Chairman

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

4 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

5 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

6 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

7 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

7 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

7 hours ago