చైనాకి ఆ నలుగురి షాక్… భారత్ బలం పెరుగుతోంది

India China

డ్రాగన్ దేశం దురాగతాలను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాలు ఏకం అవుతున్నాయి. కొద్ది నెలలుగా భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యాలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అందరు చూస్తున్నదే. మొదట లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ తర్వాత ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలోను దుస్సాహసానికి పాల్పడుతోంది. చైనా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నాలు చేసినపుడల్లా మన సైన్యాలు ధీటుగా సమాధానం చెబుతున్న కారణంగా డ్రాగన్ పన్నాగాలు ముందుకు సాగటం లేదు. లేకపోతే మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసి చాలా కంపు చేసేదనటంలో సందేహం లేదు.

ప్రత్యక్షంగా మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా అగ్రరాజ్యం అమెరికా, పొరుగునే ఉన్న జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడా ఏదో విధమైన జగడాలకు దిగుతోంది. అవసరం లేకపోయినా పై దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ఏదో రూపంలో గొడవలకు రెచ్చగొడుతోంది. దాంతో ఒళ్ళు మండిపోయిన పై దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని డిసైడ్ అయ్యాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కీలక నేతలు భారత్ లో సమావేశమవ్వాలని నిర్ణయించాయి. అయితే హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా జపాన్ దేశం నుండి ఎవరు రావటం లేదు.

అలాగే ఆస్ట్రేలియా నుండి కూడా ప్రస్తుతానికి ఎవరు రావటం లేదు. అందుకనే అమెరికా విదేశాంగ శాఖమంత్రి మైక్ పాంపియో తొందరలోనే మనదేశానికి వస్తున్నారు. ముందుగా వీళ్ళద్దరు సమావేశం అయి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. తర్వాత అందరికీ అనువైన తేదీలో నాలుగు దేశాల కీలక నేతలు సమావేశవ్వనున్నారు. డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు నాలుగు దేశాల సైన్యాలు ఒకటిగా ఉండాలని నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ వెంబడే చైనా సైన్యం ప్రయత్నిస్తున్న చొరబాట్లు, మనసైన్యంపై దాడులు చేయటం, ఇండో-పసిఫిక్, దక్షిణ చైన సముద్ర జలల్లో డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరి తదితరాలు ప్రధాన అజెండాగా ఉండబోతున్నాయి.

ఈ నాలుగు దేశాల మధ్య రక్షణపరమైన సహకారమే కాకుండా మిలిటరీ హార్డ్ వేర్ పరికరాలు ఇచ్చి పుచ్చుకోవటం, ప్రపంచ వాణిజ్య రంగంలో కూడా చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నాయి. మొత్తానికి ప్రపంచంలో రోగ్ నేషన్ గా ప్రచారంలో ఉన్న చైనాకు వ్యతిరేకంగా చాలా దేశాలు తొందరలో ఏకం కానున్నాయి. అసలే ప్రపంచదేశాలను కరోనా వైరస్ కబళించటానికి చైనానే కారణమని చాలా దేశాలు మండిపోతున్నాయి. దానికి అదనంగా చైనా వైఖరి కూడా తోడై మండిపోతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికైతే నాలుగు దేశాలు ఏకమయ్యాయి. ముందు ముందు ఇంకెన్ని దేశాలు మనదేశంతో చేతులు కలుపుతాయో చూడాల్సిందే.