……………………………..
ఏపీ ఓటర్లకు బుర్రా , బుద్ది ఉందా ?
ఏపీ ఓటర్లు ఒట్టి మూర్ఖులు …!
ఏపీ ఓటర్లకు తిక్క కుదిరింది ….!
అయిదుళ్ళుగా ఇలా అనుకుంటున్న వారందరికీ జూన్ 4, 2024న ఈవీఎం బటన్ నొక్కి సమాధానం చెప్పారు ఏపీ ఓటర్లు.
ఓటరు ఎంత సైలెంటుగా ఉంటే రిజల్ట్ అంత వైలెంటుగా ఉంటుందని ప్రజాస్వామ్య జెండా ఎగరేసి మరీ చెప్పారు.
…….
ఏపీ ఓటర్లు ఓడించింది జగన్ ని కాదు … తలకెక్కిన అహంకారాన్ని !
ఏపీ ఓటర్లు ఊడ్చేసింది… వైసీపీని కాదు …. మదమెక్కిన అధికారాన్ని !
ఏపీ ఓటర్లు ఈడ్చి పడేసింది ప్రజలను హింసించే నాయకులనే కాదు … ప్రజాస్వామ్య కంఠకులను !
ఏపీ ఓటర్లు గెలిపించింది చంద్రబాబునే కాదు … భవిషత్తు దార్శనికతకు !
ఏపీ ఓటర్లు ఓటేసింది జనసేనకే కాదు …. ఎదురొడ్డిన ధైర్యానికి !
ఏపీ ఓటర్లు ఎగరేసింది కూటమి జెండాలనే కాదు …. సైకోల పీఠాలు కదిలిస్తామనే సందేశాన్ని !
అందుకే వారికి వందనం … శిరసా వందనం
………
పాలకులు ఎవరైనా కావొచ్చు…! పాలించేది ఏ పార్టీ అయినా కావొచ్చు !
ప్రజలే సుప్రీంలని చాటిచెప్పారు.
అన్యాయం జరిగినప్పుడు … అవమానం ఎదురైనప్పుడు …
అరాచకం విర్రవీగినప్పుడు ….
సోషల్ మీడియాలో అసంతృప్తి వెళ్లగక్కినా గొంతు నొక్కేవారి పీక పిసికేస్తామని గళమిప్పి చెప్పారు.
అధికారం ఉందని …. హత్యలు, అత్యాచారాలు చేసి…
అడిగితే అణచివేతకు దిగితే …
అతః పాతాళానికి తొక్కేస్తామని కాలరెగరేసి చెప్పారు.
పదవులున్నాయని నోరు పారేసుకుంటూ ….
పవర్ ఉందని చేయి పారేసుకుంటూ …
ఎంగిలి మెతుకులు పడేస్తే గొర్రెల్లా పడి ఉంటారనుకుంటే ….
ఓటుతో బుద్ది చెబుదామని ,
వేటు వేసి గద్దె దించుతామని ,
రాక్షస కోటలైనా బద్దలు కొడతామని …..
గుండె తట్టి చెప్పారు ….
తమకు బుర్రా , బుద్ది ఉన్నాయని దేశానికి రొమ్ము విరిచి చెప్పారు.
అందుకే ఏపీ ఓటరుకు వందనం ….
శిరసా వందనం.
- కోగటం
🙏🏻💐🙏🏻
Gulte Telugu Telugu Political and Movie News Updates