ఏపీలో ట్రెండ్ మారుతోంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ట్రెండ్‌లో నూ దిగువకు పడుతూ వచ్చిన వైసీపీ మధ్యాహ్నం 1 గంటల సమయానికి మరింత దిగజారింది. నిజానికి 2019లో 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈ సారికి వచ్చే సరికి తొలి ట్రెండ్స్‌లో 14 నుంచి ప్రారంభమై.. 25 వరకు వెళ్లింది. అయితే.. కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ప్రతి విడతలోనూ.. వైసీపీ దిగజారి పోయింది.
దీంతో మధ్యాహ్నం 1 గంటల సమయానికి 18 స్థానాలకు పడిపోయింది. దీంతో వైసీపీ అధినేత కానీ.. ఇతర కీలక నాయకుల కానీ.. ఎవరూ కూడా బయటకు రాలేదు. కనీసం మీడియా ముందుకు కూడా ఎవరూ రాలేదు. మరోవైపు సీఎం జగన్.. తన ఇంట్లోనే పరిమితమయ్యారు. ముఖ్య నాయకులతో ఆయన చర్చిస్తు న్నారు. ఇక్కడ కీలక విషయం.. ట్రెండ్స్‌పై ఇక, వైసీపీకి ఆశలు పోయాయి. ఇక, గెలుస్తామన్న ఆలోచన నుంచి..ఇప్పుడు కనీసం ప్రతిపక్షం హోదా అయినా దక్కించుకుంటామా? అనే స్థాయికి పడిపోయారు.
దీంతో వైసీపీలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి మారిపోయింది. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. కనీసం 67 స్థానాలైనా దక్కించుకుంది. కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారవడం కాదు .. అత్యంత దారుణంగా మారిపోయింది. ఎన్నడూ ఊహించని స్థాయిలో.. కనీసం కలలో కూడా.. జగన్ ఊహించని స్థాయిలో ఇప్పుడు వైసీపీ 15-18 స్థానాలే దక్కనున్నాయని అంటున్నారు. ఇదే జరిగితే కోరం ప్రకారం.. 10 శాతం మేరకు వైసీపీకి సీట్లు దక్కక పోతే.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కే పరిస్థితి లేకుండాపోతుంది.
This post was last modified on June 4, 2024 1:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…