టీడీపీ అధినేత చంద్రబాబు తాను చేసిన శపథాన్ని నిరూపించుకున్నారు. కౌరవ సభలో ఉండను.. గౌరవ సభ ఏర్పాటైన తర్వాత.. సీఎంగానే సభలో అడుగు పెడతానంటూ.. 2022లో ఆయన చేసిన శపథం.. అందునా నిండు సభలో చేసిన శపథం.. ఇప్పుడు నిజమైంది. కనీ వినీ ఎరుగని రీతిలో.. టీడీపీ విజయం దక్కించుకుంది. అంతేకాదు… ఏకపక్ష విజయం దక్కించుకుంది. పోటీ చేసిన 144 స్థానాల్లోనూ 135 స్థానా ల్లో విజయం సాధించే దిశగా దూసుకుపోయేందుకు టీడీపీ వడివడిగా ముందుకు అడుగులు పడుతు న్నాయి.
ఇదిగమనిస్తే.. టీడీపీ ఏకపక్షంగా విజయం దక్కించుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఆ నాడు 2022లో వైసీపీలోకి జంప్‌చేసిన గన్నవరం అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా లోకేష్, నారా భువనేశ్వరి కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ వరకు పాకాయి. దీంతో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారుసభలో నిప్పులు చెరిగారు. “ఇది కౌరవ సభ. మళ్లీ గౌరవ సభ ఏర్పాటయ్యే వరకు.. నేను సీఎంగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టను” అని శపథం చేసి.. దండం పెట్టి మరీ బయటకువచ్చారు.
ఆనాడే టీడీపీ నేతలు.. వైసీపీ పతనం ప్రారంభమైందని.. సభలో వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు కళ్లకు కట్టినట్టు నిజమైంది. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. లండన్ వెళ్తూ.. ఆశ్చర్య కరమైన పోలింగ్ జరిగిందన.. దేశం మొత్తం ఏపీవైపు చూసే పరిస్థితి ఉంటుందని ఆయన చెప్పారు. అచ్చం ఆయన ఏ యాంగిల్‌లో చెప్పారో తెలియదు కానీ.. ఇప్పుడు దేశం మొత్తం ఏపీవైపు చూసేలా ప్రజా తీర్పు ఏకపక్షంగా సాగిపోయింది. మహిళలు రాత్రి 9 గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉండిమరీ ఓటేశారు. పలితంగా కౌరవ సభ పోయి.. గౌరవ సభ ఏర్పడి.. చంద్రబాబు తన శపథాన్ని నిరూపించుకున్నారు.