టీడీపీ రికార్డును బ్రేక్ చేసిన వైసీపీ!

రాజ‌కీయాల‌లో ఏదీ ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఒక‌రిని వెక్కిరించినంత స‌మ‌యం ప‌ట్ట‌దు.. వెక్కిరించిన వారు .. సైతం.. ఆ ప‌రిస్థితి చేరుకునేందుకు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌దే ప‌దే వైసీపీ.. టీడీపీని వెక్కించింది. ఎందుకంటే.. వైసీపీ 151 సీట్లు అప్ప‌ట్లో ద‌క్కించుకుంది. ఇదేస‌మ‌యంలో టీడీపీ 23 సీట్లు మాత్ర‌మే ద క్కించుకుంది.దీంతో అన్ని కోణాల్లోనూ.. వైసీపీ .. టీడీపీని తీవ్ర‌స్థాయిలో ఏకేసింది. 23 సీట్లే ద‌క్కించుకు న్నార‌ని వ్యాఖ్యానించారు.

అలాంటి వైసీపీకి ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లో ఇదే ఫ‌లితం వ‌స్తుందా? అనేది సందేహంగా మారిపోయింది. రాష్ట్రంలో జ‌రుగుతున్న కౌంటింగ్ ట్రెండ్‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీ కేవ‌లం 12 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది. మ‌హా అయితే.. మరొక్క సీటు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి వ‌చ్చిన కౌంటింగ్ ట్రెండ్‌ను ప‌రిశీలిస్తే.. ఏక‌ప‌క్షంగా ప్ర‌జ‌లు ఓటేశారు. అంతేకాదు.. వైసీపీకి గుండుగుత్త‌గా వ్య‌తిరేకించారు.

ఫ‌లితంగా 2019లో వ‌చ్చిన టీడీపీ 23 స్థానాల‌ను కూడా వైసీపీ ద‌క్కించుకునే ప‌రిస్థితిలో లేకుండా పోయింది. ఇది నిజానికి.. టీడీపీ రికార్డును బ్రేక్ చేసిన‌ట్టే అవుతుంది. క‌నీసం 23 స్థానాలు కూడా.. ద‌క్క‌క పోవ‌డం అంటే.. ఇదే క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు వైసీపీ ఏం చెబుతుంది? ఏం చేస్తుంది? అనేది ప‌క్క‌న పెడితే.. వైసీపీకి ప్ర‌జ‌లు బ‌ల‌మైన షాక్ ఇచ్చార‌నే చెప్పాలి. సంక్షేమం క‌న్నా.. రాజ‌ధాని, అభివృద్ధి దిశ‌గానే ప్ర‌జ‌లు అడుగులు ముందుకు వేశార‌ని అంటున్నారు.